భూమనకి షాక్ ..తుని కేసులో నోటీసు ..

  bhumana karunakar reddy got shocked by chandrababu sarkar
వైసీపీ అధినేత జగన్ కి ఆప్తుడు,వ్యూహచతురుడు ,తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి బాబు సర్కార్ షాక్ ఇచ్చింది.తుని విధ్వంసం,రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కేసుకి సంబంధించి విచారణ కోసం తమ ముందు ఈ నెల నాలుగో తేదీన హాజరు కావాలని cid నోటీసులు జారీ చేసింది.ఆయనతో పాటు నెంబర్ 1 న్యూస్ ఛానల్ యజమాని సుధాకర్ నాయుడు కి కూడా నోటీసులు అందాయి.హోదా ఉద్యమం నుంచి జనం దృష్టి మరల్చడానికి ఈ నోటీసులని భూమన వాదిస్తున్నారు.

కానీ కాపు ఉద్యమ నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఎత్తులకు తాజా పరిణామం మరో ఉదాహరణ.ముద్రగడని హీరో చేయడం ద్వారా గత ఎన్నికల్లో దూరమైన కాపు వర్గాన్ని ఆకర్షించడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.కాపు ఉద్యమం కోసం దాసరి ఇంట్లో సమావేశమైన నేతల్లో 80 శాతం వైసీపీ నేతలే.ఆ విషయాన్ని గమనించే కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు దాసరి కి లేఖ రాశారు.వైసీపీ వల్లో పడొద్దని ఆయన్ని హెచ్చరించారు.కానీ కేసు విచారణ మొదలైన ప్రతిసారి ముద్రగడ దాన్ని కులం మీద దాడిగా చూపడం ప్రభుత్వానికి ఇబ్బంది గా మారింది.ఘటన జరిగిన వెంటనే నాటి గొడవలతో కాపేతరులకి సంబంధం ఉందని కొన్ని ఆధారాలు సేకరించారు.అప్పట్లోనే భూమన పాత్రపై సందేహాలు వ్యక్తమైనట్టు తెలిసిందే.తాజా నోటీసులతో సర్కార్ మరో పాచిక వేసింది.జాక్ ఆధ్వర్యంలో ముద్రగడ కాపు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న నేపథ్యంలో సర్కార్ అడుగులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.చివరికి ఇది ఎటు దారి తీస్తుందో కాలమే చెప్పాలి.

SHARE