ఆంధ్రజ్యోతి బహిష్కరణ..ఏ అధికారంతో?

0
328
bhumana karunakar reddy said andhrajyothy will be banned

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bhumana karunakar reddy said andhrajyothy will be banned
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ సామెతని ఇంకోసారి అందరికీ గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.”అమ్మ జగనా” పేరుతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కధనం వైసీపీ లో ప్రకంపనలు రేపింది.ప్రధాని మోడీని జగన్ వ్యక్తిగత అవసరాలతోనే కలిసాడని చెప్పిన ఆ కధనం నిజం కాదని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.అందులో తప్పేమీ లేదు.ఫిబ్రవరి లో ప్రధానికి రాసిన లేఖని ఇప్పుడు ఇచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి తప్పుడు కధనం ఇచ్చిందని భూమన ఆరోపించారు. అందులో నిజనిజాలేమిటో ఆంధ్రజ్యోతి కౌంటర్ తర్వాతే అర్ధం అవుతుంది.కానీ ఆంధ్రజ్యోతిని అన్ని స్థాయిల్లో బహిష్కరిస్తున్నామని భూమన ప్రకటించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.ఏ హక్కు,అధికారంతో ఆంధ్రజ్యోతిని వైసీపీ బహిష్కరిస్తుంది?

పాత్రికేయ విలువలు పాటించక పోవడమే ఆంధ్రజ్యోతి బహిష్కరణకు కారణమైతే …అదే పని సాక్షి విషయంలో చేసినప్పుడు పాత్రికేయ విలువలు కాకుండా హక్కులు మాత్రమే ఎందుకు గుర్తుకు వచ్చాయి? ఇలా అంటున్నందున ఇదేదో ఆంధ్రజ్యోతి సమర్ధింపు వ్యవహారం కాదు. అసలు తెలుగు గడ్డ మీద సాక్షి పుట్టుక తర్వాతే పాత్రికేయ విలువల పతనం తారాస్థాయికి చేరింది. సాక్షి పుడుతూ పుడుతూనే సాటి పత్రికల రేట్లు తగ్గించాలని ఉద్యమం చేపట్టింది.ప్రపంచ చరిత్రలో ఇదెక్కడ అయినా జరిగిందా.పోటీ వ్యాపారస్తుడి ధరల్ని మరొకరు ప్రభావితం చేయడం ఎక్కడైనా ఉందా? ఆ రోజున ఇంతటి వితండం కూడా జగన్ కి హాయిగా వుంది.ఆ రోజు అధికారం వుంది కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుందనుకున్నారు.ఇప్పుడు అధికార పక్షం అలా అనుకుంటే భరించలేకపోతున్నారు. అధికారం లేకపోయినా ఓ పత్రిక బహిష్కరణకు పూనుకున్న వైసీపీ ఇక అధికారం వస్తే ఎలా వ్యవహరిస్తుందో వేరే చెప్పాలా?

Leave a Reply