పత్రికల్ని బాబు ఆలా లొంగదీసుకున్నాడా?

 Posted October 28, 2016

bhumana karunakar reddy said chandrababu doing phone tapping party leaders and media
ఆంధ్ర,తెలంగాణాలో మెజారిటీ వార్తాపత్రికలు,ఛానెల్స్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నాయి.tv9, ABN పరిస్థితి చూసాక తెలంగాణాలో ఏమి జరిగిందో అర్ధం చేసుకోగలం.ntv , కొమ్మినేని ఎపిసోడ్ లో బాబేమిటో తెలిసింది.అయితే అంతకు మించిన విషయం ఉందంటున్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అయన చెప్పిన దాని ప్రకారం’ఓటుకినోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ కి దొరికిపోయిన బాబు ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లోబరుచుకునేందుకు బాబు కుట్ర చేస్తున్నారు.పారిశ్రామిక వేత్తలు,ప్రతిపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్ లు కూడా బాబు ట్యాప్ చేయిస్తున్నారు.పత్రికల యాజమానుల్ని కూడా ఇదే విధంగా లొంగదీసుకుని వారితో ఇష్టమొచ్చినట్టు రాయించుకుంటున్నారు.ఫోన్ ట్యాపింగ్ కుట్రపై అందర్నీ కలుపుకుని పోరాడతాం’.

బాబు మీద ఉన్నట్టుండి వైసీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేయడానికి ఓ పత్రికా అధిపతి వ్యవహారశైలి కారణమని తెలుస్తోంది.అయన వైసీపీ లో వుంటూ ..టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారు.నిన్నమొన్నటిదాకా ఓ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా ఉన్న ఓ నేత వైసీపీ ఎంత అడిగినా ముందుకు రావడం లేదంట.వీటి వెనుక ఫోన్ ట్యాపింగ్ కారణం ఉండొచ్చన్న అనుమానం తోటే వైసీపీ ఈ అస్త్రాన్ని ప్రయోగ్గించింది.దీనిపై టీడీపీ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

SHARE