చంద్రబాబు కెపాసిటీ ఓ మెగా వాట్ పవర్?

Posted October 14, 2016

  bhumana karunakar reddy said  chandrababu one mega watt of current
చంద్రబాబు దగ్గరున్న డబ్బుతో ఓ మెగా వాట్ విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయొచ్చంట.ఇంత తక్కువా అని ఆశ్చర్యపోకండి.ఈ విషయం చెప్పింది సొంత పార్టీ నేతలు కాదు…బాబు అంటే ఒంటి కాలు మీద విరుచుకుపడే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి .మరి అలాంటి నేత బాబు గురించి అంత సానుకూలంగా మాట్లాడాడని పొరబడొద్దు.భూమన గారు బాబు కెపాసిటీ చెప్తూ పెద్ద మెలికే పెట్టారు.ఎవరికీ రాని ఆలోచనతో బాబు కెపాసిటీ ని పోల్చారు.ఇంతకీ భూమనకి వచ్చిన బ్రిలియంట్,క్రియేటివ్ ఐడియా ఏంటంటే..బాబుగారి దగ్గరున్న డబ్బంతా కుప్పగా వేసి తగలేస్తే ఆ వచ్చే శక్తితో ఓ మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చంట.ఏమైనా రాజకీయ విమర్శల్లోనూ తనదైన సృజనాత్మకత చూపిస్తున్న భూమనని మెచ్చుకోవాల్సిందే.

SHARE