తమిళ్ పాలిటిక్స్ లో బిగ్ డే …

85

     Posted [relativedate]  

big day in tamil politics
తమిళ రాజకీయాల్లో నేడు బిగ్ డే.ఆ రాష్ట్ర రాజకీయ గమనం ఎలా ఉండబోతోందో తేలబోయే రోజు.అన్నాడీఎంకే అధినేతగా శశికళ ఎన్నిక అవ్వడం ఖాయమనిపిస్తున్నా..ఆమె అంతటితో ఆగుతారా లేక సీఎం పగ్గాలు కూడా పన్నీర్ సెల్వం నుంచి లాక్కుంటారా? అదే జరిగితే కేంద్రం లోని మోడీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? పన్నీర్ పోరాడతారా లేక చేతులెత్తేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలకి జవాబు ఇవ్వడంలో నేడెంతో కీలకం.

నేడు జరగబోతున్న అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో పార్టీ పగ్గాలు శశికళకి అప్పగించడం లాంఛనమే అయింది..ప్రధాన కార్యదర్శి పదవికి ఓ నామినేషన్ వేద్దామని ప్రయత్నించిన బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప భర్త,ఆమె తరపు లాయర్ ని శశికళ బంటులు ఎలా చితక్కొట్టారో చూసాం.వాళ్ళు నామినేషన్ వేసినా నష్టం లేదు .అయినా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీలో తనకు ఎదురులేదని చాటాలనుకున్నారు.అందుకే ఈ ఘర్షణ.పైగా తనతో తలపెడితే ఇలా ఉంటుందని పన్నీర్ సెల్వం కి కూడా ఓ సంకేతం ఇవ్వాలని ఆమె భావిస్తూ ఉండొచ్చు.అందుకే నేడు తమిళ రాజకీయాల్లోనూ,అన్నాడీఎంకే చరిత్రలోను బిగ్ డే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here