Posted [relativedate]
బోయపాటి శీను అనే కంటే భారీ సెట్టింగులు లేక భారీ కాస్టింగ్ శీను అనడం బెటర్ అని టాలీవుడ్ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సన్నివేశం చిన్నదే అయినా తెర మీద బాగుంటుంది అనుకుంటే భారీగా రూపొందించడం, పాత్ర చిన్నదే అయినా అది సినిమాలో కీ రోల్ అనుకుంటే పెద్దపెద్ద స్టార్టలను నటింపజేయడం బోయపాటి హాబిట్ . తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా బోయపాటి అదే అలవాటును కంటిన్యూ చేశాడు. ఫలితంగా ఆ సినిమా కాస్టింగ్ తడిసి మోపెడైంది.
సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వీళ్లిద్దరితో పాటు ఇంకో ఐదుగురు హీరోలు, ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది. జగపతిబాబు, శరత్ కుమార్, లతో పాటు నందు, సై సినిమా హీరో శశాంక్ లు నటిస్తుండగా హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్, ఒక స్పెషల్ సాంగ్ కోసం క్యాథరిన్, కీ రోల్స్ లో అలనాటి హీరోయిన్స్ వాణీ విశ్వనాధ్, భీమవరం బుల్లోడు ఫేం ఎస్తర్ నొరోన్హా, సితారలు నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో బోయపాటి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.