హిల్లరీ ఎందుకు ఓడిందో ..జ్ఞానం ఉన్నవారికి తెలుసు..బిల్ క్లింటన్

0
245
bilclinton said hillary drawbacks

Posted [relativedate]

bilclinton said hillary drawbacksహిల్లరీ గెలుస్తుంది.. ఆమే అధ్యక్షురాలు అనుకునే తరుణం లో అనూహ్యం గా ట్రంప్ గెలుపొందారని ఐతే ఈ గెలుపు ఎలా సాధ్యం అయ్యింది అనేది మాత్రం జ్ఞానం ఉన్న ప్రతి ఒక్క అమెరికన్ కి ఇట్టే అర్ధం అవుతుందని..అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అన్నారు.ఐతే హిల్లరీ ఓటమికి కూడా మూడు కారణాలు ఉన్నాయని బిల్ క్లింటన్ అంటున్నారు.

  • రష్యా, ఎఫ్‌బీఐతోపాటు శ్వేత జాతీయుల్లో ఉన్న ఆగ్రహం హిల్లరీ పరాజయానికి, ట్రంప్ విజయానికి దోహదపడ్డాయని ఆయన స్పష్టం చేశారు.
  • ప్రస్తుతం ఎన్నికల్లో గెలచిన డోనాల్డ్ ట్రంప్‌కు ప్రపంచ రాజకీయాల గురించి, అధ్యక్షుడిగా ఏం చేయాలనే విషయాల గురించి ఏం తెలియదనీ, ప్రజల్లో ఆగ్రహావేశాలు ఎలా పెంచాలో బాగా తెలుసునన్నారు.
  • శ్వేతజాతీయుల్లో ఆగ్రహాన్ని పెంచి తనకు ఓటేసేలా ట్రంప్ ఉసిగొల్పుకున్నారని అంటూనే
  • ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమియోను.. హిల్లరీ మెయిల్ స్కాంలో విచారణకు ఆదేశించి ట్రంప్ గెలుపుకు పరోక్ష కారణమయ్యారంటూ విమర్శించారు.
    ఎన్నికలకు రెండు వారాల సమయం ఉన్నప్పుడు ఇలాంటి విచారణకు ఆదేశించడం హిల్లరీ గెలుపును వెనక్కినెట్టింది అంతేకాదు రష్యా కూడా emails ని హ్యాక్ చేసి హిల్లరీని వైట్‌హౌస్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నది అని అన్నారు.ఐతే అమెరికన్స్ కి మొత్తం ఇదంతా తెలుసునని అన్నారు..

Leave a Reply