ఆమెకు గంటకు కోటి..

0
993

  bipasa basu taken 1 crore rupees for 1 hourబాలీవుడ్ లో హాట్ బ్యూటీ బిపాసా గంటకు కోటి తీసుకొంటోంది.అసలు సినిమాలే అంతంత మాత్రంగా వున్న ఈ అమ్మడికి అంతంత రెమ్యూనరేషన్ ఎవరిస్తారా అని ఆశ్చర్యపోకండి…సినిమా వాళ్లకు ఆమె మార్కెట్ తెలుసు కాబట్టి ఆపని చేయలేదు.ఆ విషయంలో అంతంత మాత్రం ఐడియా వున్న కర్ణాటక సర్కార్ బిపాసాకు గంటకు కోటిన్నర ఇచ్చింది.బెంగళూర్ లో నిర్వహించిన యోగా సదస్సు లో పాల్గొన్నందుకు ఆమెకు వచ్చిన రెమ్యూనరేషన్ అది.విషయం తెలిసిన వెంటనే సీఎం సిద్ధరామయ్య పై విమర్శలు వెల్లువెత్తాయి.అసలే అంబరీష్ తిరుగుబాటు తో తలబొప్పి కట్టిన సిద్ధరామయ్య బిపాసా వల్ల మరో సమస్య వచ్చిపడింది.ఏదేమైనా బెంగుళూరు క్యాంప్ లో బిపాసా యోగా బాగానే హిట్ అయిందిలెండి.డబ్బుకి డబ్బు.. ఆరోగ్యానికి ఆరోగ్యం…ఈ కొత్త పెళ్లి కూతురికి మ్యారేజ్ బాగానే అచ్చివచ్చిందనుకొంటా!

Leave a Reply