కమలాన్ని కార్నర్ చేసిన బాబు..

0
457

bjp babu ap

రాష్ట్రం విడిపోవడానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా బీజేపీ కూడా కారణమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా కాంగ్రెస్‌, బీజేపీ కలిసి ఏపీని విభజించాయని కావున ఇరు పార్టీలు కలిసి చర్చించుకుని ఏపీకి న్యాయం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు చేయూతనివ్వాలన్నారు. విభజన చట్టంలోని అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని…మరోసారి అలా చేయొద్దని బాబు అన్నారు. ఇరురాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకే ఏపీ అవతరణ దినోత్సవాలు జరుపుకోవడంలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Leave a Reply