మోడీ వర్సెస్ శివరాజ్.. బీజేపీలో కోల్డ్ వార్

0
658
bjp cold war modi vs chowhan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bjp cold war modi vs chowhanప్రధాని నరేంద్రమోడీ సొంత పార్టీలోనే శత్రువు ఉన్నారు. ఆయన ఎవరో కాదు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన అద్వానీ అనుచరుడు కాబట్టి అస్సలు నమ్మలేమంటున్నారు మోడీ, షా ద్వయం. అందరూ యూపీ సీఎం యోగిని చూసి మోడీ కుళ్లుకుంటారని చెబుతున్నా.. అందులో వాస్తవం కనిపించడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలలో శివరాజ్ సింగ్ చౌహాన్ బాగా పాతుకుపోయారు. కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే సాకుతో ఆయన్ను కేంద్రమంత్రిగా రప్పించి, తమ మాట వినే సీఎంను పెట్టాలనేది మోడీ ఆలోచన.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కావాలంటే.. ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా బలహీన పడకూడదు. కానీ మధ్యప్రదేశ్ లో వ్యాపం స్కామ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇమేజ్ దెబ్బతీసింది. పైగా పౌష్టికాహారలోపం, ప్రసూతి మరణాలు. విద్యారంగంలోనూ ఆ రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. 29 ఎంపీ సీట్లున్న ఈ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజా వ్యతిరేకత కూడా కనబడుతోంది. అందుకే సీఎంను మారిస్తే ప్రజలు కూడా బీజేపీని ఫ్రెష్ గా చూస్తారనేది మోడీ ఆలోచన. మరి ఇందుకోసం చాప కింద నీరు లాంటి వ్యూహాన్ని కూడా రెడీ చేసేశారు.

అటు శివరాజ్ సింగ్ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొన్నటివరకూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టి.. రోజులు నెట్టుకొచ్చిన శివరాజ్.. ఇప్పుడు అలాంటి పని చేయలేరు. అందుకే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు పెట్టి ఆకట్టుకోవాలనుకుంటున్నారు. అటు పర్యావరణ పరిరక్షణ కోసం నర్మదా సేవా యాత్ర మొదలెట్టారు. ఎన్ని చేసినా బీజేపీపై వ్యతిరేకత అంతగా తగ్గలేదన్నది అధిష్ఠానం అంతర్గత నివేదిక. అందుకే శివరాజ్ ప్లేస్ లో సరైన క్యాండిడేట్ కోసం వెతుకుతోంది బీజేపీ. అప్పట్లో ప్రధాని పదవికి మోడీకి పోటీగా అద్వానీ శివరాజ్ ను తీసుకురావడం కూడా ఈ కంటగింపుకు కారణమంటున్నారు పరిశీలకులు.

Leave a Reply