ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే!!

138

Posted November 30, 2016, 9:27 am

Image result for bjp congress party's position same to same in andhra pradesh
ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలదే హవా. అందులో ఒకటి టీడీపీ అయితే మరొకటి వైసీపీ. అసెంబ్లీలో పేరుకు మూడు పార్టీలున్నప్పటికీ టీడీపీ, వైసీపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏపీలో రాజకీయం నడుస్తోంది. పేరుకు మూడో పార్టీ బీజేపీ ఉన్నా… ఆ పార్టీ టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. దీంతో టీడీపీ వెంట నడవడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితినే చూసుకుంటే అక్కడ ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేదు. రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కాంగ్రెస్ మట్టికొట్టుకపోయింది. దీంతో ఆ పార్టీకి భవిష్యత్తు కనిపించడం లేదు.

Image result for bjp congress

రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఏపీలో పుంజుకోలేకపోయాయి. నిజానికి మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో… బలపడడానికి కమలానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అయినా ఆ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇక కేంద్రం ప్రత్యేక హోదా అంటూ ఊరించి.. చివరకు ప్యాకేజీకి వచ్చేయడంతో బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. వెంకయ్య నాయుడు వంటి జాతీయ నాయకుడు ఉన్నా… ఆ పార్టీ ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేకపోతోంది.

అటు కాంగ్రెస్ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్ర విభజన తాలూకు పరిణామాలు ఆ పార్టీని నీడలా వెంటాడుతున్నాయి. ఇప్పట్లో హస్తం తేరుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే కీలకనేతలు ఒకరిద్దరు మినహా అందరూ ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని ఆపార్టీ ఆశించడం తప్ప ఈ పరిస్థితిలో ఇంతకంటే చేయడానికేం లేదు. అటు బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి దొందూ… దొందే అన్నట్టుంటే… వామపక్షాలు పోరాటాలకే తప్ప ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతున్నాయి.

Image result for jagan chandrababu

ప్రాంతీయ పార్టీల శకం మొదలైన తరుణంలో ఇక జాతీయ పార్టీల మనుగడకే ప్రమాదముందని ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఏపీలోనూ అదే జరుగుతోందంటున్నారు పరిశీలకులు. ఎప్పటికప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, ఎత్తులతో ముందుకెళ్తే తప్ప ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ కి ఓట్ల శాతం పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here