ఏపీ కి భారీ ప్యాకేజ్..1.5 లక్షల కోట్లు ?

1

ఆంధ్రప్రదేశ్ కోసం లక్షా 50 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పోర్టుల అభవృత్ధి కోసం 20 వేల కోట్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి 25 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి 10 నుంచి 15 వేల కోట్లు, కమర్షియల్‌ కారిడార్‌ కోసం 12 వేల కోట్లు, పోలవరం కోసం 28 కోట్లు, ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టుల కోసం 30 వేల కోట్లు, లోటుభర్తీకి 10 వేల కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 2 వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. పీఎంవోలో ఈ ప్యాకేజీకి తుది మెరుగులు దిద్దినట్లు తెలిసింది. ఈ ప్యాకేజీ రూపకల్పనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, సురేష్‌ప్రభు, ఎంపీ సీఎం రమేష్‌ పలుమార్లు సమావేశమయ్యారు. రాత్రి జరగబోయే మీడియా సమావేశంలో అరుణ్ జైట్లీ దీనికి సంబంధించిన అసలు సమాచారాన్ని వెల్లడించనున్నారు.

 

SHARE