ఆ మంత్రికి కమలం హైకమాండ్ పిలుపెందుకో?

  bjp high command amith shah called manikyala rao
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.పవన్ కళ్యాణ్ కాకినాడ సభకి వ్యక్తిగతంగా మద్దతుంటుందని మాణిక్యాలరావు ఇటీవలే ప్రకటించారు.ఆ సభలో పవన్ బీజేపీ ని టార్గెట్ చేశారు.ఈ నేపథ్యంలో మాణిక్యాలరావుకు కమలం హైకమాండ్ నుంచి పిలుపు రావడం కుతూహలం రేకెత్తిస్తోంది.పవన్ కి మద్దతు వ్యాఖ్యలపై ఆయన్ని ప్రశ్నిస్తారా ?లేక ప్యాకేజ్ తర్వాత పరిణామాలపై ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుంటారా అన్నది తెలియాల్సి వుంది.

ఆంధ్రాలో స్వతంత్రంగా ఎదగాలని బీజేపీ ఎప్పటినుంచో భావిస్తోంది.అయితే అందుకు అనుకూల వాతావరణం లేకుండా పోయింది .ఈ పరిస్థితుల్లో కొందరు కాపు నేతలు..ముఖ్యంగా సోము వీర్రాజు ,కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు బాబుకి వ్యతిరేకంగా హైకమాండ్ ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.కొంత వరకు సక్సెస్ అయ్యారు.కాపుల్ని ప్రోత్సహించడం ద్వారా ఏపీ లో బలపడాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు పవన్ రూపంలో ఇబ్బంది ఎదురైంది.హోదా అంశం పార్టీ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.ప్యాకేజ్ ప్రకటన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం తో హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది.ఈ సమస్యని ఎదుర్కోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు.మాణిక్యాలరావు పిలుపు వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.

SHARE