ఆశ‌ల‌ప‌ల్లకిలో బీజేపీ!!!

 Posted March 24, 2017

bjp hotes for elections
అన్నాడీఎంకే పార్టీ త‌మ‌దంటే త‌మ‌దంటూ పోటీప‌డిన ప‌న్నీర్ సెల్వం, చిన్న‌మ్మ వ‌ర్గాల‌కు ఈసీ షాకిచ్చింది. ఎవ‌రికీ అన్నాడీఎంకే గుర్తు రాలేదు. అంతేకాదు ఇద్ద‌రికీ వేర్వేరు పార్టీ పేర్లు, కొత్త గుర్తులు వ‌చ్చాయి. శ‌శిక‌ళ వ‌ర్గానికి సంబంధించిన ఏఐఏడీఎంకే అమ్మ‌గాను… పార్టీ గుర్తును టోపీగా నిర్ణ‌యించింది. ఇక ప‌న్నీర్ సెల్వం వ‌ర్గానికి విద్యుత్ స్తంభం గుర్తును కేటాయించారు. పార్టీ పేరును ఏఐఏడీఎంకే పురుచ్చిత‌లైవి అమ్మ‌గా నిర్ణ‌యించారు.

రెండాకుల గుర్తు ద‌క్క‌క‌పోగా.. కొత్త పార్టీ .. కొత్త గుర్తు వ‌చ్చేయ‌డంతో ఇప్పుడు ప‌న్నీర్ సెల్వం, చిన్న‌మ్మ వ‌ర్గాలు టెన్ష‌న్ లో ఉన్నాయి. ఈ రెండు వ‌ర్గాలు ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కొత్త గుర్తుతో జ‌నాన్ని మెప్పించ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లే కొత్త గుర్తు కాబ‌ట్టి అది జ‌నాల‌కు అర్థ‌మయ్యే లోపు పుణ్య‌కాలం గ‌డిచిపోనుంది. అస‌లే ఏప్రిల్ 12న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆ రెండు వ‌ర్గాలు త‌ల‌ప‌ట్టుకుంటున్నాయి.

ప‌న్నీర్ సెల్వం, చిన్న‌మ్మ వ‌ర్గాల‌కు తోడు దీపకు కూడా కొత్త గుర్తే. దీంతో జ‌నాల‌కు తెలిసిన ప్ర‌ధాన పార్టీలు ఇప్పుడు రెండే మిగిలాయి. ఒక‌టి డీఎంకే… రెండోది బీజేపీ. డీఎంకేకు ఆర్కే న‌గ‌ర్ లో అంత ప‌ట్టులేదు. ఇక మిగిలింది బీజేపీయే. ఇప్పుడు దేశ‌మంతా ప్ర‌ధాని మోడీ పేరు మార్మోగిపోతోంది కాబ‌ట్టి బీజేపీకి అది క‌లిసి వ‌చ్చే అంశ‌మే. అందులోనూ ఆర్కే న‌గ‌ర్ లో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు ప్ర‌చారం చేసే అవ‌కాశ‌ముంది. కేంద్ర‌మంత్రుల‌తో పాటు పార్టీ దిగ్గ‌జ‌నాయ‌కులు క్యాంపెయిన్ లో పాల్గొన‌బోతున్నారు. తమిళ‌నాడు అభివృద్ధికి మోడీ బాటలు వేస్తార‌న్న ప్ర‌చారంతో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నించ‌నుంది. దీంతో ఓట‌ర్లు ఈసారి క‌మ‌లం వైపు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడుకు చెందిన క‌మ‌ల‌నాథులు నూతనోత్సాహంతో దూసుపోతున్నారు. విజ‌యం త‌మదేన‌న్న ధీమాలో ఉన్నారు. మ‌రి యూపీలోలాగా ఆర్కేన‌గ‌ర్ లోనూ బీజేపీకి ఘ‌న‌విజ‌యం సొంత‌మ‌వుతుందా..? లేక ఇప్ప‌టిలాగే నిరాశ మిగులుతుందా? చూడాలి.

SHARE