గులాబీ కింద ముళ్లు ఏరుతున్న కమలం

0
530
bjp is feeling kcr will win the next elections

Posted [relativedate]

bjp is feeling kcr will win the next electionsకేసీఆర్ సీఎంగా ఎన్నేళ్లు ఉంటారు.. ఇది ప్రత్యర్థుల్నే కాదు సొంత పార్టీ నేతల్నీ వేధిస్తున్న ప్రశ్న. దీనికి భవిష్యత్ పోటీదారులుగా ఉన్న కేటీఆర్, హరీష్ తలో అంకె చెప్పారు. కేసీఆర్ 20 ఏళ్లు సీఎంగా ఉంటారని హరీష్ చెబితే.. కాదు కాదు పదేళ్లే అంటున్నారు. అంటే పదేళ్ల తర్వాత కేసీఆర్ సీఎంగా ఉంటానన్నా కేటీఆర్ ఉండనివ్వరా, ఆయన పదవిని ఈయన లాగేసుకుంటారా ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ . కానీ ఈ చిత్రమైన వాదన లేవనెత్తింది బీజేపీ నేతలే. ముందు సీఎం కేసీఆర్ పదవీయోగం ఎన్నాళ్లో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది కమలం పార్టీ.

అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు ఏమీ చేయని కేసీఆర్.. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. కొత్త వరాలు ఎందుకు ప్రకటిస్తున్నారనేది బహిరంగ రహస్యమన్నారు. ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారో లేదో కానీ.. కేసీఆర్ మాత్రం వెళ్లేలా ఉన్నారని రాష్ట్ర బీజేపీ సెటైర్లేస్తోంది. తన పాలన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని భయపడుతున్న ఎవరూ సర్వేలు చేయకముందే.. తన సర్వేలు తానే చేసుకుని.. తన డప్పు తానే కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఏకపక్షమని నమ్మకం ఉంటే.. కొత్త స్కీములెందుకని ప్రశ్నించింది.

తప్పకుండా 2019 ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు తగ్గుతాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఉద్యమం సమయంలో కేసీఆర్ కు సహకరించిన చాలా శక్తులు ఇప్పుడు సైలంట్ గా ఉన్నాయి. అన్నివర్గాల్ని కలుపుకుని ఉద్యమించిన కేసీఆర్.. ప్రభుత్వంలో మాత్రం కొన్నివర్గాలకే పెద్దపీటవేశారు. ఈ అసంతృప్తి అందరిలో ఉంది. ఏ ఓయూ విద్యార్థులైతే ఉద్యమానికి ప్రాణవాయువులు అందించారో.. ఆ విద్యార్థులపైనే లాఠీఛార్జ్ చేయించారు. ఇవన్నీ అంత తేలిగ్గా మర్చిపోయే విషయాల్లాగా కనిపించడం లేదు. అటు రైతులకు స్కీములు ప్రకటిస్తున్నా ఆత్మహత్యలు ఆగడం లేదు. అందుకే కేసీఆర్ పనైపోయిందంటున్నారు బీజేపీ నేతలు.

Leave a Reply