రజనీని పొగిడారా..? తిట్టారా..?

0
332
BJP leader Gadkari spoke about Rajinikanth

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

BJP leader Gadkari spoke about Rajinikanth

నేతలు చెప్పే మాటలు కొన్ని భలే చిత్రంగా ఉంటాయి. చెప్పే మాటలు ఒకదానికి మరొకటి సంబంధం లేనట్లుగా కనిపిస్తాయి. ఇందుకు నిదర్శనంగా కేంద్రమంత్రి.. బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన నితిన్ గడ్కరీ. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్న వేళ.. ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్న నేతల్లో గడ్కీరీ ఒకరు. రజనీ కానీ తమ పార్టీలోకి వస్తే ఆయనకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పటం తెలిసిందే. రజనీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయనతో తనకు చక్కటి పరిచయం ఉందని చెప్పిన గడ్కరీ.. ఆయన గాలి తీసేలా వ్యాఖ్యలు చేశారు.

చెన్నైకి ఎప్పుడు వెళ్లినా రజనీని తాను కలుస్తానని.. తామిద్దరం రాజకీయాల గురించి మాట్లాడుకుంటామన్నారు. రజనీతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయంటూనే.. తనతో రజనీ చెప్పిన మాటల్ని ప్రస్తావించటం విశేషం. తాను రాజకీయాలకు తగిన వాడిని కానని రజనీ తనతో చెప్పినట్లుగా గ్కడరీ వెల్లడించారు. ఆయన కానీ బీజేపీలో చేరితే తప్పకుండా సముచిత స్థానం ఖాయమన్నారు. ఇన్ని చెబుతున్నారు సరే.. రజనీ కానీ బీజేపీలో చేరితే ఆయన స్థానం ఎలా ఉంటుందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి నిర్ణయాలు పార్టీ అధినేత.. పార్లమెంటరీ బోర్డు మాత్రమే తీసుకుంటుందని చెప్పారు.

అమ్మ జయలలిత స్థానాన్ని భర్తీ చేసే శక్తి రజనీకి మాత్రమే ఉందన్న ఆయన.. అలా ఎందుకు అనుకుంటున్నారన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఒకసారి ఒక ఇంజనీర్ను రజనీకాంత్ కు తాను పరిచయం చేశానని.. ఆయనకు రజనీ షేక్ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆ ఇంజనీర్ తన చేతిని మడిచే ఉంచారని.. రజనీ అంటే ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలకు అదో నిదర్శనంగా చెప్పుకొచ్చారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అన్న ఆయన.. ఆయన్ను ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతూనే.. మరోవైపు కాస్త తగ్గించేలా మాట్లాడటం.. బీజేపీ మార్క్ పాలిటిక్స్ కు అద్దం పడుతోంది.

Leave a Reply