ఏపీ మంత్రి మీద కమలం పెద్దలవద్ద పంచాయతీ?

Posted October 5, 2016

 bjp leaders demand manikyala rao resignation
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పాలనా సామర్ధ్యం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అలా వ్యక్తం చేస్తున్న వాళ్ళు ప్రతిపక్షం కాదు…సొంత పార్టీ వాళ్లే.అంతటితో ఆగకుండా మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు కమలం నేతలు.అయితే ఆ డిమాండ్ రావడానికి ఎంతోకొంత నేపధ్యం లేకపోలేదు.

విజయవాడ శ్రీ కనకదుర్గ ఆలయ పాలకమండలి నియామకం గురించి మాట్లాడుతూ మంత్రి మాణిక్యాలరావు ..దాని విషయం తనకు తెలియదని పేపర్లో చదివి తెలుసుకొన్నట్టు వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి మాటలపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి.కొన్నాళ్లుగా మంత్రి వైఖరితో విభేదిస్తున్న విజయవాడ సిటీ కమిటీ ప్రెసిడెంట్ రాజు ని అదే టైం లో బీజేపీ సస్పెండ్ చేసింది.దీని వెనుక మంత్రి హస్తం ఉందని భావిస్తున్న మంత్రి వర్గీయులు ఆయనపై తీవ్ర విమర్శలకి దిగారు.సొంత శాఖలో ఏమి జరుగుతుందో తెలియని వారు మంత్రి పదవులకి అనర్హులని రాజు వర్గం వాదిస్తోంది.విజయవాడలో రోడ్డు విస్తరణ సమయం లో గుడుల కూల్చివేతకు సంబంధించి కూడా మాణిక్యాలరావు నోరు విప్పలేదని ఆరోపిస్తోంది.ఈ రెండు విషయాల్ని పట్టుకుని హైకమాండ్ దగ్గర పంచాయతీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు అసమ్మతి నేతలు.

SHARE