మోడీ మాటలతో కేసీఆర్ ఆటలు

Posted April 18, 2017

bjp leaders fires on kcr because of kcr want to try on muslims reservationపేద ముస్లింలకు పార్టీ చేరువ కావాలి. ట్రిపుల్ తలాక్ బాధితులైన ముస్లిం మహిళలకు కార్యకర్తలు అండగా నిలవాలి. ఇదీ భువనేశ్వర్ పార్టీ సమావేశాల్లో ప్రధాని మోడీ చెప్పిన మాటలు. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రధాని కూడా ముస్లింల్లో పేదలున్నారని చెప్పారని, తన మాట వినకపోయినా.. ఆయన మాటైనా వినాలని రాష్ట్ర బీజేపీ నేతలకు హితవు చెప్పారు. దీంతో ఒక్కసారిగా డిఫెన్స్ లో పడ్డ కిషన్ రెడ్డి టీమ్ అసలు మోడీ ఏమన్నారో వెతికే పనిలో పడ్డారు.

మోడీ మాటలను పక్కాగా తెలుసుకున్న తర్వాత.. బీజేపీ నేతలు గులాబీ బాస్ ను టార్గెట్ చేశారు. ప్రధాని మాటలకు కేసీఆర్ తప్పుడు అర్థాలు తీస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన రిజర్వేషన్లకు, పేద ముస్లింలను ఆదుకోమని చెప్పడానికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన రిజర్వేషన్ల బిల్లు కోర్టుల్లో నిలిచే ప్రసక్తే లేదని, అప్పుడు టీఆర్ఎస్ ప్రజలకు ఏం సమాధానం చెబుతుందో ఆలోచించుకోవాలని తేల్చిచెప్పారు. కానీ టీఆర్ఎస్ మాత్రం అవసరమైతే పోరాడి సాధిస్తామని చెబుతోంది.

తెలంగాణ ఉద్యమం భావోద్వేగ అంశం కాబట్టి పోరాటాలు కుదిరాయి. కానీ పాలనలో అలా కుదరదని ఇప్పటికే చాలాసార్లు కోర్టు మొట్టికాయలు తిన్న కేసీఆర్ కు తెలుసు. అయినా ఇలాంటి బిల్లు తీసుకొచ్చి కేంద్రంపై నెపం నెట్టేసే తొండి ఆడ ఆడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ డేంజరస్ గేమ్ ఆడుతున్నారని, చివరకు అది ఆయన్నే మింగేస్తుందని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. పైగా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి రావాలంటే కేంద్రం సహకారం అవసరం. సాయం అడగకుండా పోరాడతామంటే.. మోడీ కంటే మొండి ఎవరూ లేరనేది ఆయన సన్నిహితుల మాట.

SHARE