యూపీలో కమల వికాసం

0
487
bjp modi win in up elections said exit poll survey

Posted [relativedate]

bjp modi win in up elections said exit poll survey
యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి గట్టి పోటీ ఇచ్చినా.. చివరకు బీజేపీ నిలిచింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రభంజనాన్ని ఈసారి కూడా నిలబెట్టుకుంది. యూపీలో బీజేపీ దే హవా అని ఎగ్జిట్‌ పోల్స్ స్పష్టం చేశాయి. దాదాపు అన్ని సర్వేల్లో బీజేపీయే లీడ్‌ లో ఉండటం విశేషం. ఐతే ఇండియా టుడే, టుడేస్ చాణక్య సర్వేలు మినహా మెజార్టీకి కావాల్సిన సీట్లు ఆ పార్టీకి వస్తాయని ఏ సర్వే తెలుపలేదు. కానీ యూపీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు సర్వేలు స్పష్టం చేశాయి.

టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 190 నుంచి 210 స్థానాలు వస్తాయని చెబుతుండగా, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 110-130, బీఎస్సీ 57-74 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక న్యూస్ ఎక్స్-ఎంఆర్సీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 180, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 120, బీఎస్పీ 90 స్థానాల్లో ఇతరులు 8 స్థానాల్లో పాగా వేస్తారని తెలిపింది. ఏబీపీ న్యూస్ సర్వే ప్రకారం 164-176, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 156-169ల, బీఎస్పీ 60-72 ఇతరులు 2-6 స్థానాల్లో గెలుపొందుతారని తేల్చింది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 155-167, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి 135-147, బీఎస్పీ 81-93, ఇతరులు 8-20 స్థానాలు దక్కనున్నట్లు ప్రకటించింది. ఇండియా టుడే, టుడేస్ చాణక్య బీజేపీకి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టాయి. బీజేపీకి ఏకంగా 251 నుంచి 279 సీట్లు వస్తాయని తెలిపింది.ఎస్పీ కూటమికి 80 నుంచి 112, బీఎస్పీ కి 28 నుంచి 42 సీట్లు రావచ్చని అంచనా వేసింది. టుడేస్ చాణక్య సైతం బీజేపీ 285 సీట్లు కట్టబెట్టటం విశేషం. ఎస్పీ కూటమికి 88, బీఎస్పీ 27, ఇతరులు 3 సీట్లు గెలుచుకుంటారని తెలిపింది.

యూపీలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణంలో ప్రధాని మోడీయేనని టాక్. మొదటి రెండు దశల్లో బీజేపీ కొంత వెనుకంజలో ఉన్నా మూడో దశ పోలింగ్ నుంచి పరిస్థితి మారిపోయిందట. బీజేపీకి ఓట్లను రాబట్టడంలో మోడీ ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా అఖిలేశ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.

ముఖ్యంగా అఖిలేశ్ ను ఇంటిపోరు దెబ్బతీసింది. కాంగ్రెస్ శ్రేణులన్నీ రాహుల్ గాంధీనే నమ్ముకోవడం… ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొంటారని ఆశించినా అలా జరగలేదు. అది కాంగ్రెస్ కు పెద్ద మైనస్ అయ్యింది. అటు బీఎస్పీ ఎన్నికలకు ముందే డీలా పడిపోయింది. ఇలా ప్రధాన పార్టీలన్నీ ఇబ్బందులతో సతమతమవుతుంటే.. బీజేపీ మాత్రం ప్రచారంలో దూసుకుపోయింది. ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగడంతో కమలదళానికే ఎదురే లేకుండా పోయింది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ లో అదే స్పష్టమైంది. మొత్తానికి సరైన సమయంలో యూపీ పెద్ద బూస్టింగ్ ఇచ్చిందంటున్నారు కమలనాథులు. మరి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంలో సత్తా చాటడమంటే మామూలు విషయం కాదు కదా!!

Leave a Reply