ఆ ఇద్దరి మధ్య పవన్?

bjp pavan ycp
రాజకీయాల్లో ఎక్కడ ఏ బల్బ్ వేస్తే..ఏ లైట్ వెలుగుతుందో చెప్పడం కష్టం..ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరిగింది.జనసేనాధిపతి రంగంలోకి దిగితే తమకి పోటీ అవుతాడని,లేకుంటే విపక్ష ఓట్లు చీలుస్తాడని వైసీపీ కంగారు పడింది.తిరుపతి,కాకినాడ సభల్లో పవన్ బీజేపీని టార్గెట్ చేసినా చంద్రబాబుని వదిలేయడం వైసీపీకి నచ్చలేదు.అందుకే పవన్ ఓ పజిల్ అంటూ జనసేనాధిపతిని వైసీపీ టార్గెట్ చేసింది.దాడి ఉధృతం చేసే తరుణంలో ప్యాకేజ్ పై వివరణ ఇవ్వడం మొదలెట్టిన బీజేపీ ..అదే ఊపులో పవన్ కి దీటుగా సమాధానమివ్వడం స్టార్ట్ చేసింది.ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ పవన్ పై ఎదురుదాడికి దిగి వెంకయ్యను వెనుకేసుకొచ్చారు.
పవన్ పై ఎదురుదాడి మొదలైన వెంటనే వైసీపీ…జనసేనపై మాటల యుద్ధం దాదాపు ఆపేసింది.వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న ఉండవల్లి,ముద్రగడ లాంటి వాళ్ళు వ్యూహం మార్చి పవన్ కి అనుకూలంగా మాట్లాడ్డం మొదలెట్టారు.దాసరి ఇంట్లో కాపు పెద్దల సమావేశానికి కూడా పవన్ ని పిలవని ముద్రగడ ఏకంగా అయన సారధ్యంలో హోదా పోరాటానికి సిద్ధమని ప్రకటించారు.అంత ప్రేముంటే వైసీపీ ముఖ్యనేతల్ని కలిసిన ముద్రగడ కాపు రిజర్వేషన్ అంశంలో ఒక్కసారైనా పవన్ ని ఎందుకు కలవలేదో?
తాను గెలిపించిన బీజేపీ ఎదురుదాడి…తనని వద్దనుకున్న వాళ్ళు చూపిస్తున్న అవసరార్ధ అభిమానం చూసి పవన్ షాక్ అయ్యుంటారు.ప్రస్తుతానికి ఆయన నోరు విప్పలేదు.పవన్ ప్రతిస్పందన వచ్చేదాకా ఈ పరిణామాల్ని అయన ఎలా తీసుకున్నారో బయటికి తెలిసే అవకాశం లేదు.

SHARE