పవన్ పై నోరు మెదపని కమలం.. ఎందుకు.?

  bjp politician nomore comments about pawan kalyan speechసినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో స్పందించకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలోని నేతల నోటికి తాళం వేసింది. వేచి చూసే ధోరణిలో వెళ్ళాలని జాతీయ పార్టీ ఇక్కడి నేతలకు సూచించినట్లు సమాచారం. మొన్నటి బహిరంగ సభలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మాట్లాడిన పవన్  కేంద్రప్రభుత్వంపై పలుమార్లు విరుచుకుపడ్డారు. అయితే, పవన్ ఆరోపణలు, విమర్శలపై కమలం పార్టీ నేతలు ఎవరూ ఎదురుదాడికి దిగవద్దని, స్పందించవద్దని పార్టీ జాతీయ నాయకత్వం నుండి సూచనలు వచ్చాయి.

వచ్చే నెల 9వ తేదీన కాకినాడలో మరో బహిరంగ సభ నిర్వహిస్తానని పవన్ చేసిన ప్రకటనను జాతీయ నాయకత్వం గుర్తుచేసినట్లు తెలిసింది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎవరు కూడా పవన్‌పై గట్టిగా మాట్లాడవద్దని, ఆయన చేసిన ఆరోపణలకు, విమర్శలకు సమాదానం చెప్పవద్దని జాతీయ నాయకత్వం స్పష్టమైన సూచన చేసినందు వల్లే రాష్ట్ర నేతలెవరూ స్పందించలేదు.ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడి మాట తప్పుతున్నట్లుగా పవన్ ఆరోపించారు.

ప్రధాని గనుక మాట తప్పితే కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తానంటూ తీవ్ర హెచ్చరికలు కూడా చేసారు. తనకు ప్రత్యేక ంగా ఏ వ్యక్తితో కానీ లేదా ఏ అజెండా కానీ లేద న్నారు. ప్రజల ప్రయోజనమే తన అజెండా అంటూ పవన్ స్పష్టంగా ప్రకటించారు. ప్రజల కోసం తాను ప్రధానిని సైతం నిలదీయటానికి వెనుకా డనని చెప్పారు.పదవులను పట్టుకుని వేలాడవద్దని పార్టీ రాజకీయా లకన్నా దేశ ప్రయోజనాలే ఎక్కువంటూ వెంకయ్యపై విరుచుకుపడ్డారు. అంటే తన స్దార్ధం కోసం, పదవుల కోసం వెంకయ్య రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేకహోదాను కూడా పక్కనబెట్టారని ఆరోపించారు. పనిలో పనిగా తుమ్మితే ఊడిపోయి మంత్రి పదవిని వెంటనే రాజినామా చేయాలంటూ అశోక్‌గజపతి రాజును డిమాండ్ చేసారు.దాంతో ఇటు భాజపా నేతలకుమ అటు తెలుగుదేశం పార్టీ నేతలకు బాగా మండింది.

అయితే, టిడిపి ఎంపిలు, నేతలేమో పవన్‌పై ఘాటుగానే స్పందిస్తు న్నారు. ఎంపిలు అవంతి శ్రీనావాస్, జెసి దివాకర్‌రెడ్డిలు పవన్ ఆరోపణలు, విమర్శలపై గట్టిగానే స్పందించారు. ప్రత్యేకహోదా రాష్ట్రానికి అవసరం లేదన్నట్లుగా ఇంత కాలం మాట్లాడిన చంద్రబాబు విషయాన్ని కమలనాధులు ఎత్తి చూపుతున్నారు. అనవసరంగా పవన్‌కు మొదట్లో తమ జాతీయ స్ధాయి నేతలు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటంతోనే ఇపుడు పవన్ ఈ స్ధాయిలో మాట్లాడుతున్నారని బీజేపీ నేతల వాదన.

SHARE