పవన్ కి రాజకీయ ఘాటు?.

  bjp politicians counter attack  pawan kalyan
ఆంధ్రాకి ప్రత్యేక హోదా పోరాటంలో తల తెగిపడ్డా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ప్రకటించిన జనసేనాధిపతి పవన్ కి అప్పుడే ఓ సవాల్ ఎదురైంది.అది కూడా తన మద్దతుతో గెలిచిన కమలనాధులనుంచి.కాకినాడ సభలో పవన్ తమపై,కేంద్రమంత్రి వెంకయ్యపై దాడి పెంచడంతో బీజేపీ తీవ్రస్థాయిలో కౌంటర్ ఎటాక్ చేసింది.స్వయంగా కేంద్రమంత్రి వెంకయ్య రంగంలోకి దిగి ప్యాకేజ్ ప్రయోజనాలు వివరించి ఆంధ్రకి కేంద్రం చేసిన సాయం పై బహిరంగ చర్చకి సిద్ధమని సవాల్ విసిరారు.అయన నేరుగా పవన్ పేరు ఎత్తకపోయినా ఎవరి గురించి మాట్లాడారో అందరికీ అర్ధమవుతూనే వుంది.

కానీ వెంకయ్యకి మద్దతుగా రంగంలోకి దిగిన బీజేపీ అగ్రనేతలు నేరుగా పవన్ ని టార్గెట్ చేశారు.ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ …ముఖ్యమంత్రి పీఠం  కోసమే పవన్ నోరుజారుతున్నదని ఆరోపించారు.హోదా,ప్యాకేజ్ అంశాలపై చర్చకి రావాలని పవన్ కి సవాల్ విసిరారు.కేంద్రమంత్రి జవదేకర్ సైతం పవన్ వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పారు.

ఇవన్నీ ఒక ఎత్తుఅయితే బీజేపీ కి చెందిన ఓ జాతీయ స్థాయి నేత ఫోన్ లో పవన్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.ఆయనకి ప్యాకేజ్,హోదా కి సంబంధించిన వివరాలు చెప్పి విపక్షాల వల్లో పడొద్దని సూచించినట్టు తెలుస్తోంది.కానీ హోదా పై పోరాటంలో ముందుంటానని చెప్పిన పవన్ కి ఓ వైపు బీజేపీ నేతల బహిరంగ చర్చ సవాళ్లు ..మరో వైపు వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న విమర్శలు రాజకీయ రుచిలో ఘాటు చూపిస్తున్నాయి.ఈ సవాల్ ని పవన్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి .

SHARE