టీబీజేపీ “సెంటిమెంట్” అస్త్రం!!

0
545
bjp sentiment muslim reservations

Posted [relativedate]


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… తెలంగాణలో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించడం లేదు. ఎంఐఎం పార్టీకి ఉన్న అసెంబ్లీ స్థానాల కంటే… బీజేపీకి తక్కువగా ఉన్నాయి. పేరుకే జాతీయపార్టీ అయినా.. ఆ పార్టీ బలపడడం లేదు. బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి ఉద్దండులు ఉన్నా పరిస్థితిలో మార్పులేదు. అందుకనే కొత్త అస్త్రం ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలంగా ఓటేసిన తరుణంలో… ఇప్పుడు దానిపై పోరుకు సిద్ధమవుతోంది.

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ పోరు చేయడం వెనక పెద్ద స్ట్రాటజీయే ఉందట. ముఖ్యంగా ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేయడమే దీనికి వెనక ముఖ్య ఉద్దేశ్యమట. ప్రజల్లో సెంటిమెంటును రాజేసి.. తగిన రాజకీయ లబ్ధి పొందడమే ఎజెండా అని టాక్. ఇందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా అంగీకారం తెలిపారట. ఏదో ఒకటి చేయండి.. కానీ పార్టీని మాత్రం బలోపేతం చేయండి అని బీజేపీ అధినాయకత్వం సూచించిదట.

మామూలుగానైతే తెలంగాణ బీజేపీ నాయకులకు ఈ రేంజ్ లో ఆలోచన వచ్చే అవకాశం లేదు. ఈ ఆలోచన కూడా వారిది కాదని సమాచారం. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ సూచన చేశారని టాక్. కిషన్ రెడ్డి లాంటి నాయకులకు ఈ ఆలోచన అంతగా నచ్చకపోయినప్పటికీ… రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పదని రాష్ట్ర బీజేపీ పెద్దలు నచ్చజెప్పారట. దీంతో ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాటం చేస్తామ‌ని కిష‌న్ రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌ట‌న ఇచ్చార‌ట‌. వచ్చేనెలలోనే ఈ ఉద్యమం మొదలుకానుందని సమాచారం. అవసరమైతే ఢిల్లీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను కూడా ఈ ఉద్యమానికి ఆహ్వానించే అవకాశాలున్నాయని టాక్.

Leave a Reply