అద్దింట్లో హల్చల్ చేస్తున్న బీజేపీ

0
603
bjp showing guds in ap and telangana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bjp showing guds in ap and telanganaదేశ రాజకీయాల్లో పరిస్థితులెలా వున్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి అంత సీన్‌ లేదు. తెలంగాణతో పోల్చి చూసినా, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా చాలా వీక్‌ అన్నది నిర్వివాదాంశం. 2014 ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఫేర్‌ చేసిందంటే, దానిక్కారణం టీడీపీతో పొత్తు, దానికి అదనంగా బోనస్‌ రూపంలో వచ్చిన పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాల్సిందే.

అందుకోసమే, బీజేపీ గత కొద్ది రోజులుగా వ్యూహాత్మక ఎత్తుగడలకు దిగుతోంది. జగన్‌కి అపాయింట్‌మెంట్‌ రావడం, పవన్‌ – బీజేపీపై విరుచుకుపడ్తున్నా కొందరు నేతలు పవన్‌ని విమర్శిస్తూ, ఇంకొందరు నేతలు పవన్‌కి సోప్‌ వేస్తుండడం.. ఇదంతా కమలం మార్క్‌ వ్యూహాలుగానే చెప్పుకోవాలి. మరి, మధ్యలో జగన్‌ని బీజేపీ ఎందుకు దగ్గరకి తీస్తోందట.? టీడీపీని ర్యాగింగ్‌ చేయడానికే బీజేపీ, జగన్‌ని వాడుకుంటోందన్న విషయం సుస్పష్టమవుతోందిక్కడ.

మొత్తమ్మీద, 2019 ఎన్నికల నాటికి టీడీపీపై ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనీ, అప్పటికల్లా జగన్‌ బలం పుంజుకున్నా, కొత్తగా పవన్‌కళ్యాణ్‌ సత్తా చాటినా, ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వారితో అంటకాగడానికి బీజేపీ సిద్ధంగా వుందన్నమాట. అద్గదీ అసలు విషయం. ఇతర పార్టీల బలాల మీద ఆధారపడటం తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా సీన్‌ లేదనే విషయమ్మీద బీజేపీకి క్లారిటీ వుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

Leave a Reply