బీజేపీ, టీడీపీ డైవోర్స్ కి రెడీ ?

0
553

tdp bjp divorce
కమలం,సైకిల్ కాపురం విడాకుల దాకా వచ్చిందా ?ఏ కాపురం లో అయినా కలతలు ..కలహాలు కామన్..అవి భరించలేని స్థాయికి వచ్చినప్పుడే కట్టుబాట్లు తెగిపోతాయి .ఇప్పుడు బీజేపీ,టీడీపీ మధ్య అవే పరిస్థితులు ఉన్నాయా?ఔను ..ఔననే చెప్పక తప్పదు .

ఎందుకోగానీ ఆది నుంచి చంద్రబాబుని కమలనాధులు డౌట్ డౌట్ గానే చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలు పేరుకు మిత్రపక్షమే గాని ఆ కంఫర్ట్ బాబుకి ఎప్పుడూ రాకుండా చూశారు. బాబు తొలి సంతకం పెట్టిన రైతురుణమాఫీ మొదలుకొని ఇప్పటి కృష్ణపుష్కరాల దాకా పరిస్థితిలో మార్పేమీ లేదు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం, రెవిన్యూ లోటు, రాజధానికి నిధులు ….ఇలా ఒక్క విషయంలో కూడా బాబు మిత్రసాయం పొందలేకపోయారు .ఎదురుచూసి ..చూసి …ఇక చూపులే మిగిలాయని తెలుసుకున్నాక బాబు బాణీ మారింది…కాదు కాదు..మార్చుకోవాల్సివచ్చింది .బాబుని వ్యక్తిగతంగా ద్వేషించే వాళ్ళు ,విభజన తర్వాత బీజేపీ పంచన చేరిన మరికొందరు ఇందులో సక్సెస్ అయ్యారు .

కేంద్రవైఖరితో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఓ వైపు ..రాజకీయంగా జరుగుతున్న నష్టం మరోవైపు …ఇక లాభంలేదనుకున్న బాబు మిత్రపక్షం మీద దాడి పెంచారు .క్యాబినెట్ భేటీలు మొదలుకొని ప్రెస్ మీట్ ల దాకా కేంద్రం సహకరించడం లేదని చెప్తున్నారు . తాజాగా కేవీపీ ప్రైవేట్ బిల్లు వ్యవహారంలో మద్దతు ప్రకటించి మాటల్ని చేతల దాకా తీసుకెళ్లారు .కమలనాధులు ఏమి జరిగినా లెక్కచేయడం లేదు.ఈ పరిస్థితుల్లో కేంద్రానికి దగ్గరగా ఉంటున్న సుజనా గొంతులోను మార్పొచ్చింది .నిన్నమొన్నటి దాకా కేంద్రం అన్ని చేస్తుందని చెప్పిన ఆ మంత్రిగారి మాట మారింది.కేంద్రం మిత్రధర్మం పాటిస్తోందా అని ప్రశ్నిస్తున్నారు ..ఇది చాలదా …ఏమి జరుగుతుందో చెప్పడానికి ? ఇవి విడాకుల ముందు గొడవలు అనిపించడంలేదా ?

Leave a Reply