కమలం గులాబీ దోస్తీ..?

  bjp trs friendship

మొన్నటివ‌ర‌కూ ప్రధాని మోడీ తెలంగాణ‌పై క‌క్ష క‌ట్టారు అని తెలంగాణ రాష్ర్ట స‌మితి నేత‌లు విమర్శలే…విమర్శలు…. కానీ ఇప్పుడు సీన్ మారింది.. మీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమ‌ని అంటున్నారు… చివరకు మాకు నిధులు వ‌ద్దు.. మీ ప్రేమ ఉంటే చాలు` అని కేసీఆర్ చెప్పడంలో ఎంత మార్పు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి… రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు ఎలా మారిపోతారో ఊహించ‌లేమ‌న‌డానికి  తెలంగాణ‌లో మోడీ తొలి ప‌ర్యట‌నే నిద‌ర్శనం..దీంతో ఈ స‌భ‌తో తెలంగాణ‌ రాజ‌కీయాల్లో స‌రికొత్త సమీక‌ర‌ణాలు రాబోతున్నాయా? అంటే అవున‌నే అంటున్నాయి ప్రతిప‌క్షాలు.

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలకు శాశ్వత మిత్రుత్వాలకు స్థానం లేదని మ‌రోసారి రుజువైంది. తెలంగాణ‌లో మోడీ తొలిప‌ర్య‌ట‌న సూప‌ర్ స‌క్సెస్ అయింది. మోడీ, కేసీఆర్ ఒక‌రినొక‌రు ప్రశంసించుకున్నారు. ఈ ప‌ర్యట‌న‌కు ప్రతిప‌క్షాలు కొత్త భాష్యం చెబుతున్నాయి. బీజేపీతో టీఆర్‌ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరిగిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేసీఆర్ కమల దళంతో జత కట్టి బరిలోకి దిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అధికార‌మే ల‌క్ష్యంగా రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయ‌న్నారు.

బీజేపీ వర్గాలు సైతం ఇందుకు సై అంటున్నట్టు తెలుస్తోంది. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని దానిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పథకాన్ని ప్రధాని మోడీతో ప్రారంభింపజేశారని ఉత్తమ్ ఆరోపించారు. పైగా కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో బీజేపీతో పొత్తు.. టీఆర్ఎస్ కు లాభ‌మేన‌న్న ఆశాభావంతో…. కమల దళంతో పొత్తుకు గులాబీ ద‌ళం ఉవ్విల్లూరుతోంద‌న్నారు. ఇక ప్రస్తుతం మిత్రప‌క్షాలుగా ఉన్న టీడీపీ-బీజేపీ పొత్తు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేవ‌లం ఆంధ్రా వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని…

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌-బీజేపీ క‌లిసి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం చ‌ర్చించుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీకి అధికారానికి చాలా త‌క్కువ‌గా సీట్లు వ‌స్తాయ‌ని..ప్రాంతీయ పార్టీల‌తో జోడీక‌ట్ట‌క త‌ప్పద‌న్న అభిప్రాయం కూడా స‌ర్వత్రా వ్యక్తమ‌వుతోంది. మ‌రి మోడీ తాజా ప‌ర్యట‌న కూడా అందుకు ఊత‌మిచ్చేలా ఉంది. కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ఎన్డీయేలో చేరుతుంద‌ని వార్తలు కూడా వ‌స్తున్నాయి. 

SHARE