పొత్తులు x కత్తులు @విజయవాడ

0
764

  bjp vs tdp politics vijayawadaఏం చేద్దాం …రెండు పార్టీలు …రెండు ప్రభుత్వాలు మధ్య సమన్వయానికి ఏం చేద్దాం?రెండ్రోజుల కిందట ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు..బీజేపీ ఆంధ్ర వ్యవహారాల ఇంచార్జి సిద్ధార్ధనాధ్ సింగ్ సమావేశం ప్రధాన అజెండా అది….కూర్చొన్న విషయం పై పూర్తిగా ఏకాభిప్రాయం రాకపోయినా సామరస్య వాతావరణంలో పనిచేయాలని రెండు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.అనుకున్నంత టైం పట్టలేదు.. ఆ వాతావరణం చెడిపోవడానికి.విజయవాడ లో గుడుల కూల్చివేత వ్యవహారం తో టీడీపీ ,బీజేపీ నేతలు రోడ్డునపడి తిట్టుకొనే దాకా వచ్చింది…

పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా విజయవాడ కార్పొరేషన్ రోడ్డు విస్తరణ చేపట్టింది.కొన్ని దేవాలయాలు కూల్చాల్చివచ్చింది…..ఇంకేముంది…కాంగ్రెస్ ,వైస్సార్ సీపీ నేతలు ఈ అంశాన్ని వివాదం చేశారు.ఆ పార్టీ ల నేతలు వీధుల్లోకి వచ్చారు..ఏమైందో ఏమో..బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా  వాళ్ళతో జతకలిశారు.సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.టీడీపీ వైపు నుంచి MLC బుద్దావెంకన్న,ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ..ఎదురుదాడికిగారు…మిత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది.ఇంతలో ఢిల్లీ సమావేశం….పరిస్థితి గాడిన పడుతుందనుకున్నారు. కానీ
కన్నా,సోము వీర్రాజు రంగ ప్రవేశం చేశారు.చంద్రబాబంటే మండిపడే ఈ ఇద్దరు నేతలు కాస్తదూకుడు ప్రదర్శించారు….టీడీపీ నేతలు కూడా వారి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నానికి దిగటం తో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.కన్నా వాయస్ కాస్త కఠినంగా నే వున్నా,మొన్నటిదాకా టీడీపీ మీద మాటలతో బాంబులు పేల్చిన సోము వీర్రాజు వైఖరే ఆశ్చర్యపరచింది.ఏం జరిగినా చంద్రబాబు సర్కార్ మీద నెపం మోపే వీర్రాజు టోన్ సడెన్ చేంజ్ ..హై కమాండ్ ఏం చెప్పిందో కానీ…గుడుల కూల్చివేత వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు.ఇది నిజంగా టీడీపీ కే కాదు బీజేపీ నేతలకు కూడా ఆశ్చర్యం కలిగించిన విషయం.

అయితే కన్నా లక్ష్మీనారాయణ ను టార్గెట్ చేస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని చెలరేగిపోయారు.బీజేపీ అధికారంలోవున్న గుజరాత్,మహారాష్ట్రలో దేవాలయాల కూల్చివేత వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు.ఆ లెక్కలు చెప్పి మరి దీనికి మీ సమాధానం ఏంటని నిలదీశారు.
పరిస్థితి మరీ దిగజారకుండా టీడీపీ హైకమాండ్ రంగంలోకి దిగింది.మంత్రుల్ని రంగంలోకి దించింది.వినాయక ఆలయం ..శనీశ్వరాలయం మరికొన్ని ఆలయాల్ని కదిలించబోమని.మంత్రులు మాణిక్యాలరావు ,ప్రత్తిపాటి పుల్లారావు దేవినేని ఉమా ప్రకటించారు.ఏదేమైనా రెండు వర్గాలు చెరో అడుగుముందువేశాయి.ఆ వెంటనే వెనక్కి తగ్గాయి..అంటే…టీడీపీ ,బీజేపీ మధ్య కత్తుల పొత్తు కొనసాగుతోంది.చంద్రబాబు వ్యతిరేకులు కత్తులతో ఆ పొత్తును తెగ్గొట్టాలని చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు రివర్స్ అవుతున్నాయి.బీజేపీ హైకమాండ్ ఈ విభేదాలు వెనక ఉందా?సర్దుబాట్లు వెనుక ఉందా ?ఈ విషయం తేలితే కత్తుల పొత్తు చిక్కుముడి వీడిపోతుంది.

Leave a Reply