జయకి ఆ పార్టీ చేతబడి చేయించిందా?

 Posted November 2, 2016

black magic on jayalalitha
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో చేరి దాదాపు 40 రోజులైంది.ఆమె ఆరోగ్యం మీద భిన్న కధనాలు వస్తున్నాయి.ఇంతకీ ఆమె అనారోగ్యానికి కారణం ఏంటనేది ఇప్పటిదాకా ఎవరూ చెప్పలేదు .ఓ విదేశీ పత్రిక తాజాగా అందుకు సంబంధించి ఓ సంచలన కధనాన్ని ప్రచురించింది.లండన్ నుంచి వస్తున్న డైలీ మెయిల్ అనే పత్రిక జయ అనారోగ్యానికి చేతబడి కారణమని ఓ కధనం ఇచ్చింది .తమిళనాడుకి చెందిన ఓ జ్యోతిష్కుడు ఈ విషయాన్ని చెప్పాడని కూడా ఆ కధనంలో వివరించింది .డీఎంకే లోని కొందరు లక్షల రూపాయలు ఖర్చుబెట్టి ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని ఆ పత్రిక అభిప్రాయపడింది .అన్నాడీఎంకే లో కూడా అమ్మ అంటే పడని కొందరు ఈ దురాగతానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పత్రిక సందేహం వెలిబుచ్చింది .
ఇంతకంటే సంచలనం ఇంకోటి వుంది ..జయ తర్వాత అనారోగ్యం పాలైన కరుణానిధి మీద కూడా తాంత్రిక శక్తుల ప్రభావమేనని తమిళ జ్యోతిష్కుడు చెప్పినట్టు ఆ పత్రిక తెలిపింది .ఈ కధనం ఇప్పుడు తమిళనాట సంచలనమే కాదు ఉద్రిక్తతలు కూడా రేపుతోంది.

SHARE