అడక్కపోయినా అప్పిచ్చారు..మోడీ మహిమ?

Posted November 10, 2016

black money is out by modis action
కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఓ సమావేశం ఆశ్చర్యకరమైన విషయాలకి వేదికైంది.స్థానిక ఎమ్మెల్యే,కొందరు రాజకీయ నేతలు కలిసి ఈ సమావేశానికి వచ్చారు.ఊరక రారు మహానుభావులని..ఉట్టి చేతులతో రాలేదు వాళ్ళు..నోట్ల కట్టలతో దిగారు.సమావేశానికి వచ్చిన ఒక్కో మహిళని పిలిచి ఓ మూడు అప్పుగా తీసుకుని 6 నెలల తర్వాత వడ్డీ లేకుండా తిరిగివ్వమని చెప్పారు.ఇంతకీ వాళ్ళు ఇచ్చిన డబ్బంతా 500,1000 నోట్లేనని వేరే చెప్పాలా? పైగా పెద్దగా చదువుకోని ఆ మహిళలకి..బ్యాంకుల్లో మాకన్నా మీకే త్వరగా డబ్బు మారుతుంది అని మాయ మాటలు కూడా చెప్పారు. ఏమైనా మోడీ మహిమ..అడక్కుండానే అప్పిచ్చే వాళ్ళు ..పైగా రాజకీయ నాయకులు…అబ్బా ఒక్క రోజులో ఎంత మార్పు?

SHARE