ఆ రహస్యాన్ని ఎన్టీఆర్ కాపాడగలడా?

 Posted March 25, 2017

boby hide ntr looks in jai lava kusa movie
జై లవకుశ షూటింగ్ అనుకున్నట్టే సాగుతోంది.అయితే ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ ఓ రహస్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడింది.అదేమిటో తెలుసా ? ఎన్టీఆర్ చేస్తున్న పాత్రల్లో అతి ముఖ్యమైన క్యారెక్టర్ గెట్ అప్.అసలు ఈ పాత్ర,గెట్ అప్ గురించి ఎగ్జైట్ అయ్యి బాబీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ప్లాప్ తర్వాత బాబీ కసిగా ఈ సినిమా స్క్రిప్ట్ మీద పనిచేశాడు.అయితే ఈ ఇద్దరినీ ఒకే ప్లాట్ ఫామ్ మీదకి తీసుకొచ్చిన క్యారెక్టర్ గెట్ అప్ సినిమా రిలీజ్ అయ్యేదాకా బయట పెట్టకూడదని ఎన్టీఆర్,బాబీ భావిస్తున్నారు.అయితే ప్రతి చేతిలో సెల్ ఫోన్,ఆ ఫోన్ లో ఓ కెమెరా వుండే ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయడం అంత తేలికేమీ కాదు.అందుకే షూటింగ్ స్పాట్ లో సెల్ ఊసు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఆ రహస్యాన్ని ఎన్టీఆర్ జై లవకుశ విడుదల దాకా ఎలా కాపాడగలడో చూద్దాం..

SHARE