సన్నబడటానికి చిట్కాలు ఇవే..

0
906

loss-weight
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ప్రధాన సమస్య ఊబకాయం, బరువు పెరగడం. అందుకే త్వ‌ర‌గా బరువు త‌గ్గిగిపోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కొందరైతే జిమ్ లకు పరుగులు పెడతారు. మరి కొందరు ఆస్పత్రులు, క్లీనిక్ లను నమ్ముకుంటారు. కానీ అలాంటి ప్రయాసలేం పడకుండా స్లిమ్‌గా మారేందుకు చక్కటి టిప్స్ మీ కోసం.. ఫాలో అవ్వండి సన్నని మెరుపుతీగలా మారిపోండి.
.
1. ఉద‌యం ప్రొటీన్లు ఎక్కువ‌గా ఉన్న బ్రేక్ ఫాస్ట్ తినాలి. అలా తిన‌డం వ‌ల్ల మిగ‌తా రోజంతా ఆక‌లి అంత‌గా ఉండదు. అద‌నంగా తిన‌డం త‌గ్గుతుంది.

2. తియ్య‌టి పానీయాలు, ప‌ళ్ల ర‌సాలు ద‌రిచేయ‌నీయొద్దు. ఇవి శ‌రీరంలోకి కొ్వ్వును చేరుస్తాయి. అందుక‌ని వీటికి దూరంగా ఉంటే బ‌రువు త‌గ్గ‌డం తేలిక‌వుతుంది.

3. భోజ‌నానికి అర‌గంట ముందు నీళ్లు తాగాలి. మూడు నెల‌ల‌పాటు ఇలా చేస్తే బ‌రువు త‌గ్గే వేగం 44 శాతం పెరుగుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

4. సాల్యుబుల్ పైబ‌ర్ కొవ్వును తగ్గిస్తుంది. అది కూడా పొట్ట ప్రాంతంలో..అందుక‌ని సాల్యుబుల్ పైబ‌ర్ క‌లిగి ఉన్న ఓట్ బ్రాన్, బార్లీ, న‌ట్స్, సీడ్స్, బీన్స్, లెంటిల్స్ , బ‌ఠాణీలు, కొన్ని ప‌ళ్లు, కూర‌గాయాల వంటివి తినాలి.

5. కాఫీ, టీ లు సేవించే అల‌వాటు ఉందా..అయితే ఎంచ‌క్కా వాటిని తాగొచ్చు. వీటిలో ఉంటే కెపైన్ జీవ‌క్రియ‌ల్ని 3.11 శాతం పెంచుతుంది.

6. ప్రాసెస్ చేయ‌ని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మ‌ల్ని ఆరోగ్యంగా ఉంచ‌డ‌మే కాకుండా పొట్ట‌ని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.

7. గ‌బ‌గ‌బా తినే అవాటు ఉంటే దాన్ని వెంట‌నే మానాలి. ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంత‌కాలంలోనే ఎక్కువ బ‌రువు పెరుగుతాయి. నెమ్మ‌దిగా తినేవాళ్ల‌కి పొట్ట నిండుగా ఉంటుంది. బరువును త‌గ్గించే హార్మోన్ల ప‌నితీరు మెరుగుపడుతుంది.

8. చిన్న ప‌ళ్లాల్లో తింటే మీకు తెలియ‌కుండానే త‌క్కువ తింటార‌ని ప‌రిశోధ‌ల్లో వెల్ల‌డైంది. సో..ఇక నుంచి చిన్న ప‌ళ్లాల్లోనే తినడం మొద‌లు పెట్టండి.

9. ప్ర‌తిరోజు రాత్రి హాయిగా నిద్ర‌పోండి. స‌రిగా నిద్ర‌పోలేదో బరువు పెరిగిపోతారు. అందుక‌ని నిద్ర ప‌ట్ల దృష్టి పెట్టండి.

10. వీటి అన్నింటితో పాటు రోజు వ్యాయామం చేస్తే మంచిది.

Leave a Reply