బొజ్జ‌ల అసంతృప్తి గ‌ళం!!

 Posted April 2, 2017

bojjala gopala krishna reddy disapointed
చంద్ర‌బాబు కేబినెట్ నుంచి ఉద్వాస‌న‌కు గురైన బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిని బ‌ల‌వంతంగా త‌ప్పించారా? ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌న్న ప్ర‌చారం ఒట్టిదేనా? అందుకే మ‌న‌స్తాపంతో మంత్రిప‌ద‌వితో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా బొజ్జ‌ల‌ రాజీనామా చేశారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి అనారోగ్యంగా ఉన్నార‌న్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయ‌న‌కు వ్య‌తిరేక‌వ‌ర్గ‌మే ఈ ప్ర‌చారం చేసింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బొజ్జ‌ల మొద‌ట్లోనే ఈ ప్ర‌చారాన్ని ఖండిస్తే స‌రిపోయేది. కానీ ఆల‌స్యం జ‌రిగిపోయింది. అటు చంద్ర‌బాబు కూడా ఇదే నిజ‌మని న‌మ్మార‌ని టాక్. దీంతో ఆయ‌న స్థానంలో వైసీపీ నుంచి వ‌చ్చిన అమ‌ర్నాథ్ రెడ్డి అవ‌కాశం ఇచ్చార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ముఖ్యంగా త‌న అనారోగ్యాన్ని సాకుగా చూపెట్ట‌డంపై బొజ్జ‌ల తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ఆయ‌న మంత్రిప‌ద‌వికి రిజైన్ చేయ‌డ‌మే కాకుండా ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రిజైన్ చేశారు. ఈ మేర‌కు స్పీక‌ర్ కు రాజీనామా లేఖ‌ను పంపారు. అదే స‌మ‌యంలో పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త‌గా కొన‌సాగుతాన‌ని కూడా బొజ్జ‌ల చెబుతున్నారు.

ఏదేమైనా కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన త‌రుణంలో బొజ్జ‌ల ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ అధినాయ‌క‌త్వం బొజ్జ‌ల‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ట‌. స్వ‌యంగా లోకేశ్ కూడా రంగంలోకి దిగార‌ని స‌మాచారం. అయితే ఆయ‌న మెత్త‌బ‌డే అవ‌కాశాలు క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

మొత్తానికి ఇప్పుడు మంత్రిప‌ద‌విని కోల్పోయిన బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి నిజంగానే టీడీపీలోనే ఉంటారా? ఆయ‌న రాజీనామాను స్పీక‌ర్ ఆమోదిస్తారా? అన్న‌ది చూడాలి.

SHARE