బొజ్జల‌ను టెన్షన్ పెడుతున్న జ‌గ‌న్!!!

0
339
bojjala is tensed of jagan

Posted [relativedate]

bojjala is tensed of jagan
ఏపీ మంత్రి బొజ్జల గోపాల‌కృష్ణారెడ్డికి అస‌లు మినిస్ట్రీ ఉంటుందో ఊడుతుందో అర్థం కావ‌డం లేదు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ద‌గ్గర ఆయ‌న‌కు మార్కులు త‌క్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న పెర్ఫామెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇది చాల‌ద‌న్నట్టు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం శ్రీకాళ‌హ‌స్తిలో ఆయ‌న‌కు త‌ల‌నొప్పి ఎదుర‌వుతోంది. నియోజక‌వ‌ర్గంలోని టీడీపీ నేత‌లు బొజ్జల తీరుపై అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఆ అసంతృప్త బ్యాచ్ అంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది.

శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో బొజ్జల‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో అనుచ‌రులే.. ఆయ‌న‌పై తిరుగుబాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే త‌ర్వాత అంత‌టి కీల‌క‌మైన మున్సిప‌ల్ చైర్మన్ ఈ మ‌ధ్య తిరుగుబాటు బావుటా ఎగ‌ర‌వేశారు. తానే ముఖ్యమంత్రిని క‌లిసి ఎమ్మెల్యే టికెట్ అడుగుతాన‌ని బొజ్జల‌కే స‌వాల్ విసిరారు. అంతేకాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ రాక‌పోతే… వైసీపీలోకి వెళ్లడానికి కూడా మున్సిప‌ల్ ఛైర్మన్ రెడీగా ఉన్నార‌ని టాక్. బొజ్జల ఆయ‌న‌ను ఎంత బుజ్జగించాల‌ని చూసినా ఫ‌లితం ద‌క్కలేదు. ఆయ‌న మంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

మున్సిప‌ల్ ఛైర్మన్ అసమ్మతి గ‌ళం త‌ర్వాత‌… ఇప్పుడు శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్పంచ్ ల వంతు వ‌చ్చింది. ఆ స‌ర్పంచ్ లంతా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. వైసీపీ అధినాయ‌క‌త్వానికి క‌బురు కూడా పంపార‌ట‌. ముఖ్యంగా శ్రీకాళ‌హ‌స్తి మండ‌ల టీడీపీ ప్రధాన కార్యద‌ర్శి, ప్రస్తుతం రాచ‌గ‌న్నేరి స‌ర్పంచ్ గా ఉన్న బొల్లినేని జ‌గ‌న్నాథం నాయుడు … ఈ అసంతృప్త స‌ర్పంచ్ ల‌కు నాయ‌కుడిగా ఉన్నారట.

నిజానికి బొల్లినేని బొజ్జల‌కు అత్యంత స‌న్నిహితుడు. శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి కీల‌క‌మైన నాయ‌కుడు. అందులోనూ బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి ఆయ‌న బొజ్జల తీరుపై అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఏళ్లుగా పార్టీలో ఉన్నా… మంత్రిగారు త‌న‌కు చేసిందేమీ లేద‌ని ఆయ‌న ఫీల‌వుతున్నార‌ట‌. పార్టీ కోసం ఎంత క‌ష్టప‌డ్డా త‌న‌కు గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతో… త‌న‌లాంటి అసంతృప్తులంద‌రినీ ఆయ‌న చేర‌దీశార‌ట‌. ఈ లిస్టులో స‌ర్పంచ్ లే ఎక్కువ‌గా ఉన్నారట. బొల్లినేని ఇప్పటికే స్వయంగా జ‌గ‌న్ తోనూ మాట్లాడిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. బొజ్జల ముఖ్య అనుచ‌రులు కావ‌డంతో జ‌గ‌న్ కూడా ఆయ‌న రాక‌పై చాలా ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. పార్టీలోకి వ‌స్తే త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని కూడా భ‌రోసా ఇచ్చిన‌ట్టు టాక్.

బొల్లినేని విష‌యం బొజ్జల దృష్టికి ఆల‌స్యంగా వెళ్లింద‌ట‌. కానీ ఇప్పటికే ఆల‌స్యం జ‌రిగిపోయింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బొల్లినేని ఇక పార్టీ మార‌డం లాంఛ‌న‌మేన‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఇప్పుడు బొజ్జల త‌ల‌ప‌ట్టుకుంటున్నార‌ట‌. జ‌గ‌న్ వ‌ల్లే త‌న‌కు న‌ష్టం జ‌రుగుతోంద‌ని తెగ ఫీల‌వుతున్నార‌ని టాక్. ఇప్పుడు బాధ‌ప‌డి ఏం లాభం? అదేదో ముందే అనుచ‌రుల‌కు త‌గిన ప్రాధాన్యం ఇస్తే బావుండేది క‌దా అంటున్నాయి టీడీపీ అసంతృప్త నాయ‌కులు!!! అంతేక‌దా మ‌రి!!!

Leave a Reply