‘బాహుబలి 2’ ఇష్యూ :  కెఆర్‌కెపై బాలీవుడ్‌ స్టార్స్‌ ఫైర్‌

0
290
bollywood actors and karan johar fires on kamaal r khan tweet over the bahubali 2 movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

bollywood actors and karan johar fires on kamaal r khan tweet over the bahubali 2 movie
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమా దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. కాని ఒకే ఒక్కడు మాత్రం ఇదో చెత్త సినిమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఆయన బాలీవుడ్‌ విశ్లేషకుడు కమాల్‌ ఆర్‌ ఖాన్‌. ఈయన వ్యాఖ్యల గురించి ఏ ఒక్కరు కూడా పెద్దగా పటించుకునే పరిస్థితి లేదు. గతంలో పవన్‌ కళ్యాణ్‌, రజినీకాంత్‌, మోహన్‌లాల్‌ వంటి బడా స్టార్స్‌పైనే ఈయన విమర్శలు చేసి పబ్లిసిటీ సొంతం చేసుకున్నాడు. సెబ్రెటీలను విమర్శించడం ద్వారా సెలబ్రెటీ అవ్వాలని ఆలోచించే ఈ వ్యక్తి తాజాగా ‘బాహుబలి 2’పై చేసిన విమర్శలు శృతిమించాయి.

ఇప్పటి వరకు ఈయన వ్యాఖ్యలను పెద్దగా పటించుకోని బాలీవుడ్‌ సినీ జనాలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి 2’ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ బాలీవుడ్‌లో పంపిణీ చేసిన విషయం తెల్సిందే. కరణ్‌ జోహార్‌ సంస్థకు మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. ఆ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా, ఒక అద్బుతమైన సినిమాకు నష్టం చేకూర్చే సినిమాలా కెఆర్‌కె కామెంట్స్‌ ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కమాల్‌ ఇలాంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సైతం బాహాటంగానే అంటున్నారు. బారతీయ సినిమా ఖ్యాతిని పెంచేలా ఉన్న ‘బాహుబలి 2’ సినిమాపై విమర్శలు అంతకు మించి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కొందరు స్వయంగా హెచ్చరించారు.

Leave a Reply