Posted [relativedate]
ప్రస్తుతం బాలీవుడ్ లో కొనసాగుతున్న బయోపిక్ ల ట్రెండ్ కు ఊతమిస్తూ ప్రస్తుతం టీం ఇండియా క్రికెట్ వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్ ను సినిమా తీయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే సదరు దర్శక నిర్మాతలు యువిని కలవడం సినిమాగా మలిచే తన జీవిత విషయాల గురించి మాట్లాడుకున్నారట. రెండు సార్లు వరల్డ్ కప్ టీం లో ఆడిన యువరాజ్ క్యాన్సర్ తో పోరాడి మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
అయితే యువి పడ్డ బాధ కచ్చితంగా సినిమాకు ఉపయోగపడుతుందని యువరాజ్ బయోపిక్ కు సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్లో పేరు మోసిన ఓ డైరక్టర్ ఈ సినిమా తీస్తాడని తెలుస్తుంది. యువి లైఫ్ హిస్టరీ ఎంతో గొప్పగా ఉంటుంది. జట్టులో స్థానం సంపాదించిన నాటి నుండి మద్యలో క్యాన్సర్ తో చేసిన పోరాటం అంతా సినిమాలో చూపిస్తారట. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న యువరాజ్ వైఫ్ తో కలిసి హనీమూన్ కు వెళ్లాడు.
అక్కడ నుండి తిరిగి రాగానే బయోపిక్ కు సంబందించిన విషాయల పట్ల ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. జట్టులో సాధారణ ఆటగాడి నుండి స్టార్ బ్యాట్స్ మన్ గా యువి ఎదిగిన తీరు అందరిని వారెవా అనేలా చేస్తుంది. మరి బయోపిక్ తో రాబోతున్న యువి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఇప్పటికే ఎస్.ధోని అన్ టోల్డ్ స్టొరీ హిట్ అవడంతో అదే బాటలో యువి మూవీ కూడా సూపర్ హిట్ చేయాలని చూస్తున్నారు.