Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరోల స్థాయిని మించి మరీ ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ఉంది అంటే అందులో ఏమాత్రం అతి శయోక్తి లేదు. అందుకే ప్రభాస్ త్వరలో నటించబోతున్న ‘సాహో’ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ‘సాహో’ మొత్తం థియేట్రికల్ రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.
తెలుగులో ఇప్పటి వరకు ‘1’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాల హక్కులు తీసుకుని చేతులు కాల్చుకున్న ఈరోస్ సంస్థ మళ్లీ ఇప్పుడు ‘సాహో’ను పంపిణీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ‘సాహో’పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల దృష్ట్యా ఏకంగా 400 కోట్లను నిర్మాతలకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రభాస్ సన్నిహితులు అయిన వంశీ మరియు ప్రమోద్‌లు 150 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ను సుజీత్ దర్శకత్వంలో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతున్న ఈ సినిమాను ఇంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ఈరోస్ సిద్దం అయ్యింది. అన్ని భాషల థియేట్రికల్ రైట్స్‌తో పాటు, ఓవర్సీస్ రైట్స్‌కు కలిపి 400 కోట్లను ఇచ్చేందుకు ఈరోస్ సంస్థ ముందుకు వచ్చింది. ఇదే కనుక నిజం అయితే ఇంత కంటే సంచలనం మరోటి ఉండదు.