పదేళ్ల బొమ్మరిల్లు ..

 bommarillu movie 10 years
బొమ్మరిల్లు …ఈ సినిమా వచ్చి నేటికీ కచ్చితంగా పదేళ్లు ..ఈ పదేళ్లుగా తెలుగు చలన చిత్ర రంగంలో వచ్చిన మార్పులకి శ్రీకారం చుట్టిన సినిమా బొమ్మరిల్లు. కధ కన్నా హీరో పెద్ద..అంతకన్నా హీరో ఇమేజ్ గొప్ప ..మనకు సంబంధం లేని బ్యాక్ డ్రాప్ లో స్టోరీలు ,పిచ్చిపిచ్చి పాటలు,ఫైట్లు …..ఇదంతా ఉంటేనే సినిమా గ్యారంటీ ..లేకుంటే అమ్మో ఏ నిర్మాత ముందుకు రాడు.ఇవీ అప్పటి ఆలోచనలు ..వీటన్నిటినీ సమూలంగా మార్చేసిన సినిమా బొమ్మరిల్లు.మన ఇంటి కధ ,ఓ కుటుంబం ,అందులో తండ్రీకొడుకుల సంబంధాలు …వీటి చుట్టూ తిరిగిన కధ ..ప్రేమ నేపధ్యమే అయినా కుటుంబ విలువలకు పెద్ద పీట వేసిన సినిమా బొమ్మరిల్లు .

ఇన్ని చేసినా ,ఎంత గొప్ప సినిమా అయినా ఆడకపోతే లాభం లేదు ..కానీ ఆ కొరత రాకుండా చూసారు తెలుగు ప్రేక్షకులు .తమ ఇంటి కథను మనసారా ఆస్వాదించారు ..ఆశీర్వదించారు ..అందుకే తీసింది చిన్న సినిమా అయినా పెద్ద హిట్ కొట్టింది .అంతకన్నా ఇప్పటికీ అందరి నోళ్ళలో నానుతోంది .ఈ సినిమా డైరెక్టర్ భాస్కర్ కి తొలి చిత్రం ..అయినా గొప్పగా తెరకెక్కించాడు.తన ,మిత్రుల జీవితాల్లో నుంచే ఈ కధ పుట్టిందని భాస్కర్ చెప్తుంటాడు. ఇక నిర్మాతగా ఈ సినిమా దిల్ రాజు ని మరో మెట్టు ఎక్కించింది.

అయితే ఈ ఇద్దరికీ బొమ్మరిల్లు వల్ల ఎంత మేలు జరిగిందో అంతే కీడు కూడా జరిగింది .ప్రతిదానికి బొమ్మరిల్లుతో పోలిక పెట్టడం వీరికి భారంగా మారింది .ఒక విధంగా భాస్కర్ కెరీర్ స్లంప్ లో పడింది. ఇక దిల్ రాజు బొమ్మరిల్లు మేనియా నుంచి ఇంకా బయటకు రాలేదు .ఆ తరహా కథలవైపు అయన ఇంకా మొగ్గు చూపుతున్నారు .అయితే వీళ్లంతా అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది.అద్భుతాలు ఎప్పుడో ఓ సారి జరుగుతాయి ..అది కూడా ముందు ఎవరికీ తెలియదు ,,అద్భుతం లో భాగమైనవారితో సహా ..వున్నది ఒకటే దారి ..పని చేసుకుంటూ వెళ్లడమే ..ఏమో మళ్లీ అద్భుతం జరగొచ్చు …బొమ్మరిల్లు కట్టవచ్చు ..

SHARE