అయ్యో… రోజాని ఎంత మాటనేశాడు?

bonda-uma-vs-roja

అట్టు పెట్టినమ్మకి అట్టున్నర పెట్టడం నేటి రాజకీయాల్లో మాములే కదా..విశాఖ వేదికగా జరిగిన జై ఆంధ్ర ప్రదేశ్ సభలో చంద్రబాబు,లోకేష్ ని టార్గెట్ చేసిన రోజా చెలరేగిపోయింది.బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు, బాబు వయసుకు ముడిపెట్టి ముతక మాటలు వాడేసింది.ఒకప్పుడు అసెంబ్లీ లోనే రోజాకి నోటిదూకుడుకి తగ్గట్టు ఎదురుదాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరోసారి తన నోటికి పని చెప్పారు.

విశాఖ బీచ్ ఫెస్టివల్ ఆంధ్రా ఆడపడుచులు చూసేలా నిర్వహిస్తామని అయన వివరణ ఇచ్చారు. ఊహు..అక్కడితో ఎక్కడ ఆగారు? మీరు సినిమాల్లో బికినీలు వేసి డాన్స్ చేసినట్టు అసభ్యతను ప్రోత్సహించబోమని రోజా ని ఉద్దేశించి అనేశారు. అయ్యో బోండా ఆమెని అంత మాట అనేశాడే అనిపించింది చూసే వాళ్లకి …

Leave a Reply