దేశం ఎమ్మెల్యే బ్యానర్… జనసేన సింబల్

0
417

  bonda umamaheswara rao banners pawan kalyan birthday janasena symbol

బోండా ఉమా మహేశ్వర రావు.. తెలుగుదేశం ఎమ్మెల్యే .. అసెంబ్లీ లో రోజా లాంటి ప్రతిపక్ష సభ్యురాల్ని ఎదుర్కోవడానికి టీడీపీ ప్రయోగించే అస్త్రం ఈయనే.. దానితోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఎవరేమన్నా ఒంటి కాలి మీద లేవడం ఈయన స్పెషాలిటీ.. దేశానికి వీర విధేయుడిగా బ్రాండ్ పడ్డ ఉమా అనుచరులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ను విజయవాడలో ఏర్పాటు చేసిన బ్యానర్లు కలకలం రేపుతున్నాయి..

ఆ బ్యానర్లలో ఎక్కడాతెలుగుదేశం ప్రస్తావన లేకపోవడం అర్ధం చేసుకోవచ్చు… బోండా ఉమా , పవన్ కళ్యాణ్ ఫొటోలతో పాటు జనసేన జెండాలు దర్శనమివ్వడం దేశం వర్గాల్ని అయోమయం లో పడేసింది.. అదేరోజు వినాయక ఉత్సవాలు గొడవలో బోండా ఉమా , కోగంటి సత్యం గొడవపడ్డారు. టీవీ చర్చల్లో మీరు పవన్ వైపు వెళ్తున్నారని సత్యం కూడా విమర్శించారు. అప్పటిదాకా దూకుడుగా వ్యవహరించిన బోండా ఆమాటతో రాజకీయాలెందుకులే అని చప్పబడ్డారు.. ఇదంతా చూస్తుంటే ఎవరికైనా డౌట్ రావడం సహజం.. కానీ బోండా మాత్రం అదేమీ లేదంటున్నారు. చూద్దాం .. ఆయన మాటలో నిజమెంతో .? నిజాయితీ ఎంతో.?

Leave a Reply