Posted [relativedate]
సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలుగు సిని పరిశ్రమలో ఓ సంచలనం అన్నట్టే. సాహసం ఊపిరిగా తెగించి సినిమాలు చేసిన సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కృష్ణ సిని ప్రస్థానం గురించి ఆయన వ్యక్తిగత విశేషాల గురించి సీనియర్ పాత్రికేయులు వినాయక రావు ‘దేవుడులాంటి మనిషి’ అనే టైటిల్ తో ఓ బుక్ రిలీజ్ చేశారు. ఈరోజు ఉదయం కె రాఘవేంద్ర రావు. ఎస్వీ కృష్ణారెడ్డి, సుబ్బిరామిరెడ్డి, కృష్ణ, విజయ నిర్మల వంటి వారి సమక్షంలో బుక్ రిలీజ్ చేశారు.
ఇక ఇదే విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ ఎనౌన్స్ చేస్తూ నాన్నకు ఇది సరైన టైటిల్.. దేవుడులాంటి మనిషి బుక్ లాంచ్ విషయాలను చెప్పారు. ఆ పుస్తకాన్ని చదివేందుకు నేను వెయిట్ చేయలేకున్నా అంటూ తండ్రి మీద తనకున్న ప్రేమను గౌరవాన్ని చూపించాడు మహేష్. ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమా చేస్తున్నాడు. అహ్మదాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ జనవరి 1న రిలీజ్ చేయనున్నారు.