భారీహిట్ కొట్టిన బోయపాటి ..

0
504

 boyapati sreenu super hit
మాస్ డైరెక్టర్ బోయపాటి మళ్లీ భారీహిట్ కొట్టాడు.అయితే ఈసారి ఆయన దృశ్యావిష్కరణ చేసింది వెండితెరపై కాదు…కృష్ణవేణమ్మ చెంత..దుర్గమ్మ పాదాల దగ్గర ….కృష్ణలోకి పుష్కరుడు ప్రవేశించే వేళ…కృష్ణ గోదారమ్మ సంగమస్థలి …సమయం రాత్రి 9 గంటల 28 నిమిషాలకు ….ఓ అరుదైన,అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది.నదీమతల్లి పై విద్యుల్లతల మధ్య కొలువుదీరిన నవదుర్గల సాక్షిగా …హారతి ఘట్టం ఆరంభమైంది.

ముందు కృష్ణమ్మకు ..ఆపై అమ్మవార్లకు హారతి ఇచ్చిన దృశ్యం జనం మనోఫలకం మీద ఆలా ముద్ర వేసింది.ఆ అనుభూతి ఇంకా మనసు పొరల్లోకి ఇంకలేదు.అంతలోనే ఆకాశ వీధిలో లేజర్ కిరణాలు చెంగుచెంగున ఎగురుతూ సరికొత్త నృత్యాలు చేశాయి.ఆ విరుపులు,మెరుపులు ఆస్వాదించే లోపే …తారాజువ్వల్లా నక్షత్రపు కాంతులు ..ఇలా వెంటవెంటనే కృష్ణాతీరాన ఆధ్యాత్మిక హరివిల్లు దర్శనమిచ్చింది.

ఈ ఘట్టాన్ని ఆస్వాదించటం ఓ గొప్ప అనుభవం ,అనుభూతి..కానీ దాన్ని ముందుగా ఊహించడం …ఆ ఊహలకి రూపం ఇవ్వడం అంత తేలిక కాదు .ఆ అరుదైన దృశ్యాన్ని ముందు తన మనోఫలకంపై , తరువాత జనం గుండెల్లో చెరగని ముద్ర వేసిన బోయపాటికి హ్యాట్సాల్ఫ్ ..ఈ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పిన సీఎం చంద్రబాబు కూడా ఫుల్ కుష్ ..అందుకే భావోద్వేగాల్ని పెద్దగా బయటపెట్టని బాబు కార్యక్రమం వీక్షించిన వెంటనే బోయపాటిని అంతగా అభినందించారు .

Leave a Reply