తారక్,బన్నీ కాంబో సెట్ అయినట్టేనా?

Posted December 22, 2016

boyapati srinu plan to set ntr bunny combo in bellamkonda srinivas movie
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమా ఆలోచన ఎంత క్రేజీగా ఉంటుందో…ఆ కాంబినేషన్ సెట్ చేయడం అంత కష్టంగా ఉంటుంది.కానీ అలాంటి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అయన తీస్తున్న సినిమాలో రెండు అతిధి క్యారెక్టర్ ల కోసం తారక్ ,బన్నీ ని ఒప్పించడానికి బోయపాటి ట్రై చేస్తున్నాడంట. కధలో ఆ పాత్రలకి వున్న ప్రాధాన్యం వివరించి వారితో సరే అనిపించగలమనే నమ్మకం ఆయనకి ఉందంట.ఇందుకోసం అవసరమైతే సినిమా బడ్జెట్ పెంచడానికి కూడా చిత్ర నిర్మాతలు రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే అంత తేలిగ్గా తారక్,బన్నీ ఎస్ చెబుతారా అన్నదే అసలు సమస్య.ఏదేమైనా ఈ కాంబినేషన్ సెట్ అయితే టాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాలకి మరికొందరు మొగ్గు చూపొచ్చు.

SHARE