పుష్పక విమానం ఎక్కని బోయపాటి….

0
619
boyapati srinu rejected pushpaka vimanam title

boyapati srinu rejected pushpaka vimanam titleకొన్ని క్లాసిక్‌ సినిమా టైటిల్స్‌నే లేటెస్ట్‌ చిత్రాలకు పెడితే జనాల్లో ఆసక్తి నెలకొంటుంది. ఆ చిత్రానికి కొత్త మూవీకి పోలికలు తీస్తుంటారు. పాత కథతో మా సినిమాకు సంబంధం లేదని దర్శకనిర్మాతలు చెప్పినా ప్రేక్షకుల్లో మాత్రం ఎంతోకొంత ఇంట్రెస్ట్‌ ఉంటుంది. ఇటీవలే కోన వెంకట్ ‘శంకరాభరణం’ టైటిల్‌తో మ్యాజిక్‌ చేద్దామనుకుని బోల్తాపడ్డారు. ఈ సినిమా డిజాస్టర్‌ కావడంతో ఇలాంటి టైటిల్‌ పెట్టినందుకు ఆయన్ను చాలా మంది విమర్శించారు.

ఇప్పుడు బోయపాటి శ్రీను విషయానికొస్తే.. ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘అల్లుడు బంగారం’ సినిమా తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా ఈ చిత్రానికి ‘పుష్పక విమానం’ అనే టైటిల్‌ను పెడదామనుకున్నారట. అయితే.. మాస్‌కు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో క్లాసీగా ఉన్న ‘పుష్పక విమానం’ కంటే ‘అల్లుడు బంగారం’నే ఆశ్రయించారట. కమల్ హాసన్ క్లాసిక్‌ మూవీల్లో ‘పుష్పక విమానం’ ఒకటి. ఈ టైటిల్‌పై బోయపాటి వెనక్కి తగ్గడంతో కమల్ ఫ్యాన్స్‌తో పాటూ సినీ ప్రియులూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply