చిరు,బాలయ్య మధ్య నలుగుతున్న బోయపాటి ?

0
94
boyapati srinu troubled in between chiranjeevi balakrishna for movie

Posted [relativedate]

boyapati srinu troubled in between chiranjeevi balakrishna for movie
ఖైదీ నెంబర్ 150 విడుదల టైం దగ్గరపడటంతో మెగా స్టార్ నెక్స్ట్ సినిమా ఏంటా..దర్శకుడు ఎవరా?అన్న ఆరాలు మొదలయ్యాయి. చెర్రీ కి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కి చిరు ఛాన్స్ ఇస్తారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా మెగా స్టార్ డెసిషన్ మారిందట.అయన మాస్ దర్శకుడు బోయపాటికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిపొయ్యారంట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు,బోయపాటి కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఇంతకుముందే బోయపాటి చెప్పిన ఓ లైన్ చిరుకి తెగ నచ్చిందట.దాన్ని డెవలప్ చెయ్యమని చిరు చెప్పారట.అంతా ఓకే అనుకుంటున్న టైం లో ఊహించని ట్విస్ట్ .సీన్ లోకి బాలయ్య ఎంట్రీ.

గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత 101 వ సినిమాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రైతు సినిమా చెయ్యాలని బాలయ్య ముందుగా అనుకున్నారు.అయితే కధలో మార్పులు,చేర్పులు,నటీనటుల డేట్స్ వంటి కారణాలతో ఆ సినిమా ప్రస్తుతానికి పక్కకి పోయిందట. అందుకే 102 వ సినిమా బోయపాటితో చేద్దామనుకున్న బాలయ్య 101 వ సినిమా కి రెడీ కమ్మని బోయపాటికి చెప్పడంతో సమస్య వచ్చిపడింది.ఇద్దరు దిగ్గజాల మధ్య నలిగిపోతున్న బోయపాటి ఎవరికి ఎస్ చెప్పాలి ? ఇంకెవరికి మర్యాదగా నో చెప్పాలి అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నాడట.

Leave a Reply