బోయపాటి vs కొరటాల

boyapati vs koratala

బోయపాటిపై సింహా సినిమా ఒక్కటే కొరటాల అభ్యంతరం కాదు.మరిన్ని విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలున్నట్టు తెలుస్తోంది.అందులో ఒకటి లెజెండ్ సమయంలోదేవి గురించి బోయపాటి వ్యాఖ్యలు.దగ్గరుండి పిండి మంచి పాటలు చేయించుకున్నట్టు బోయపాటి చేసిన కామెంట్స్ పై వెంటనే దేవి తప్పుబట్టారు.తనకి పని విషయం ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని కొరటాల లేవనెత్తారు.

ఓ దర్శకుడిగా కెమెరా,మ్యూజిక్ వంటి విషయాల్లో అభిరుచి తప్ప పాండిత్యం తమకి ఉండదని కొరటాల ఒప్పుకున్నాడు.అంత గొప్పోళ్ళతో తామేదో చెప్పి పని చేయించుకున్నట్టు అనుకోవడం సరికాదన్నారు.ఓ పాట తమకి నచ్చకపోతే ఇంకోటి అడుగుతాము…అంతమాత్రానికి సంగీతం విషయంలో వారికన్నా ఎక్కువ తెలుసనుకోవటం మూర్ఖత్వమవుతుందన్నారు.రెండో పాట కూడా ఆ సంగీత దర్శకుడు ఇచ్చిందేనని గుర్తుంచుకోవాలన్నారు.ఇలా చెప్పడం ద్వారా లెజెండ్ నాటి విషయాలపై బోయపాటికి కొరటాల మరో షాక్ ఇచ్చినట్టే.

ఇప్పుడు మరో అంశంలోనూ ఇద్దరి మధ్య పోటీ వచ్చినట్టు తెలుస్తోంది.గీతా ఆర్ట్స్ పై చిరు 151 వ చిత్రం తీయడానికి రంగం సిద్ధమవుతోంది.సరైనోడు హిట్ తర్వాత బోయపాటికి ఆ అవకాశం ఇవ్వాలని అరవింద్ భావించారు.వరస హిట్స్ ఇస్తున్న కొరటాలపై చిరు కన్ను పడిందట.చిరు 150 సినిమాకి సంగీతం అందిస్తున్న దేవి ..కొరటాల గురించి చిరు దగ్గర సూపర్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారట.ఈ పరిస్థితుల్లో చిరు 151 సినిమా కోసం బోయపాటి,కొరటాల మధ్య పోటీ మొదలైనట్టే కనిపిస్తోంది.

SHARE