బ్రహ్మి గుంటూరు ఎందుకు రావాలి? ఓ అభిమాని ప్రశ్న

Posted [relativedate]

brahamanandam guntur
టాలీవుడ్ లో కామెడీ కి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం ..ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గోడానికి గుంటూరు వచ్చారు.ఇది చూసిన ఆయన అభిమాని తెగ బాధపడ్డారు.అదేంటి సంతో షించాల్సింది పోయి ఇలా ఎందుకని ప్రశ్నిస్తే ఆయన గుండె లోతుల్లో అభిమానం ఎంతో అర్ధమైంది .బ్రహ్మానందం ఎప్పుడు తెర మీదే కనిపించాలి ..ఆయన కనపడగానే మా కళ్ళంట నీళ్లు వచ్చేలా నవ్వుకోవాలి ..ఇదీ ఆయన నుంచి మేము కోరుకునేది ..అన్నది ఆ అభిమాని మాట ..

ఔను ..నిజమే ఇటీవల సినిమాల్లో బ్రహ్మి కనిపించడం కాస్త తక్కువైంది .కొత్త కొత్త కమెడియన్స్ ,లేదా పాత కమెడియన్స్ కొత్తగా కన్పిస్తున్నారు ..ఏళ్ల తరబడి బ్రహ్మీకి అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ మార్పు తొందరగా రుచించడం లేదు .కానీ అభిమానులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ..కొత్త నీరు వచ్చాక పాత నీరు పోతుంది …ఆ నిజాన్ని అంగీకరించాలి ..కానీ బ్రహ్మి గుంటూరు ఎందుకు రావాలి అన్న అభిమాని మాట విన్నప్పుడు కాస్త చిరాకు అనిపించినా కామెడీ ని అభిమానించే ఆయన గుండె లోతుల్లో సెంటిమెంట్ చూశాక అక్కడ చాలా కళ్ళలో తడి కనిపించింది ..నిజమే కామెడీ కి నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు ….

*కిరణ్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here