Monday, May 23, 2022
Homelatestతాతమనవడి పాల కబురు కక్కించిన మంత్రి.

తాతమనవడి పాల కబురు కక్కించిన మంత్రి.

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,ఆయన మనవడు దేవాన్ష్ లు హెరిటేజ్ పాలు మాత్రమే తాగుతారని ప్రపంచానికి తెలిసొచ్చింది.ఈ విషయాన్ని బాబు కోడలు,దేవాన్ష్ తల్లి అయిన బ్రాహ్మణి స్వయంగా చెన్నై వెళ్లి మరీ చెప్పారు.ఇలా ఆమె చెప్పడానికి తమిళనాడుకి చెందిన ఓ మంత్రి కారణం. ఆయనే తమిళనాడు ప్రభుత్వంలో పాలు,డైరీ ఉత్పత్తుల శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ. ఆ మంత్రి గారు ప్రైవేట్ డైరీ లు ఉత్పత్తి చేసేది పాలు కాదు విషం అనే స్థాయిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలు ఎక్కువకాలం నిల్వ ఉండేలా ప్రైవేట్ డైరీ లు రసాయనాలు కలుపుతున్నాయని రాజేంద్ర బాలాజీ ఆరోపించారు.తమ బృందాలు జరిపిన అధ్యనంలో ఈ విషయం తేటతెల్లమైందని కూడా మంత్రి గారు అన్నారు.

మంత్రి వ్యాఖ్యలతో తమిళనాడులో భారీ మార్కెట్ వున్న హెరిటేజ్ కి నష్టం జరుగుతుందేమోనని ఆ సంస్థ యాజమాన్యం భయపడింది.అందుకే వెంటనే రంగంలోకి దిగింది. సంస్థలో ఉన్నత స్థానంలో వున్న బ్రాహ్మణి స్వయంగా చెన్నై వెళ్లారు.”హెరిటేజ్ పెట్ బాటిల్” ఉత్పత్తుల్ని మార్కెట్ లోకి విడుదల చేసే నెపంతో అక్కడికి వెళ్లిన ఆమె తమిళ మంత్రి వ్యాఖ్యలకు పరోక్షంగా జవాబు ఇచ్చారు.రెండేళ్ల వయసున్న తన కుమారుడితోపాటు 60 ఏళ్ళు దాటిన తన మామగారు చంద్రబాబు కూడా హెరిటేజ్ పాలు తాగుతారని చెప్పడం ద్వారా సంస్థ విశ్వసనీయత కాపాడేందుకు బ్రాహ్మణి ప్రయత్నించారు .ఏమైనా తెలుగు నాయకులు ఎన్ని విమర్శలు చేసినా బయటికి రాని విషయాన్ని ఓ తమిళ మంత్రి కక్కించారు.అదేనండి ..తాతమనవళ్ల పాల కబుర్లు.

- Advertisment -
spot_img

Most Popular