బ్రేకింగ్‌ న్యూస్‌ : ఎన్టీఆర్‌ హోస్ట్ గా బిగ్‌ బాస్‌ షో

0
502
Breaking News: Bigger Show as NTR's Best

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Breaking News: Bigger Show as NTR's Best

హిందీ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కలర్స్‌లో ప్రసారం అయ్యే బిగ్‌బాస్‌ షో ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు పది సీజన్‌లు ప్రసారం అయ్యాయి. ప్రతి సీజన్‌ కూడా ప్రేక్షకుల ఆధరణకు నోచుకున్నదే. అందులో ఒక సీజన్‌కు సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇంతటి ప్రాచుర్యం ఉన్న ఈ షోను తెలుగులో మాటీవీ తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మాటీవీ ఇప్పటికే బిగ్‌బాస్‌ షోకు సంబంధించిన హక్కులను దక్కించుకుంది.

తెలుగులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యతగా బిగ్‌బాస్‌ షోను నిర్వహించాలని మాటీవీ నిర్ణయించింది. మొదటి సీజన్‌ను ఎక్కువగా ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా ఆ తర్వాత సీజన్‌లను సునాయసంగా ప్రేక్షకులు ఆధరిస్తారనే అభిప్రాయంలో మాటీవీ వర్గాల వారు ఉన్నారు. అందుకే మొదటి సీజన్‌కు భారీ క్రేజ్‌ వచ్చేందుకు స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ను యాంకర్‌గా సంప్రదించారు. దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ షోకు ఉన్న పేరు దృష్ట్యా ఈ కార్యక్రమంకు యాంకర్‌గా చేసేందుకు ఎన్టీఆర్‌ ఒప్పుకున్నాడు. ఇందుకోసం ఎన్టీఆర్‌ ఒక్క సీజన్‌కే దాదాపు పది కోట్ల పారితోషికంను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్‌ కూడా ఎన్టీఆర్‌ తీసుకున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడి కానున్నాయి.

Leave a Reply