తెల్లోడిదెబ్బ కు మళ్లీ ప్రపంచం గడగడలాడుతోంది. బ్రెగ్జిట్ ఫలితాలు వచ్చాయి. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని 51.8 శాతం మంది బ్రిటన్ వాసులు ఓటేశారు .. ఈ ఫలితాలు బయటకురాగానే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కదిలిపోయాయి. ఆర్ధికపరంగా భారత్ మీద కూడా భారీ ప్రభావం పడింది.రూపాయి ధర బాగా పడిపోయింది. డాలర్ కు 68.22 రూపాయలుగా ఉంది.బంగారం,వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. బంగారం ధర 10 గ్రాములకు 1800 పెరిగింది.ఇక సెన్సెక్స్ ఏకంగా 1025 పాయింట్లు, నిఫ్టీ 320 పాయింట్లు పడిపోయాయి.