బ్రెగ్జిట్ ఫలితం ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తన పదవికి రాజీనామా చేశారు.ఆపద్ధర్మ ప్రధానిగా మరో మూడు నెలలపాటు పనిచేస్తానని,తర్వాత కొత్త నాయకత్వాన్ని కన్సర్వేటివ్ పార్టీ ఎన్నుకుంటుంది చెప్పారు.EU నుంచి తప్పుకోవడం మేలుకాదని బ్రిటన్ ప్రజలకు కామెరాన్ చెప్తూ వచ్చారు .అయితే రిఫరెండంలో ఆయన అభిప్రాయానికి భిన్నమైన రిజల్ట్ రావడంతో ఇంకా ఆ పదవిలో కొనసాగడం మేలుకాదని కామెరాన్ భావిస్తున్నారు…బ్రిటన్ అభిప్రాయాల్ని చూశాక నెదర్లాండ్ కూడా ఆదిశగా అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.